గౌతమి

గౌతమి

Saturday, March 21, 2015

మధుమేహం లేదా చక్కెర వ్యాధి (Insights of Diabetes)

Part-3

Part-I లో ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance) గురించీ, Part-2 లో ఇన్సులిన్ సెన్సిటివిటీ గురించి తెలుసు కున్నాము.  Part-3 లో 65 సంవత్సరాలు లేకపోయినా, వంశపారంపర్యంగా సంప్రాప్తించకపోయినా కూడా స్కూలు కెళ్ళే, కాలేజీలకి వెళ్ళే వయసుల్లో డయాబిటిస్ కి గురి అవుతున్నారు. దానికి గల కారణాలు, దాన్ని మేనేజ్ చేసే విధానాలు చర్చిద్దాం.. అలాగే డయాబిటిస్ ఆల్జీమర్ బ్రెయిన్ వ్యాధికి ఎలా దారితీస్తుందో కూడా చూద్దాం.

మొన్నటిదాకా పిల్లల్లో, టీనేజర్లలో కేవలం Type-1 డయాబిటిస్ మాత్రమే రాగల సూచనలు ఉన్నాయనుకున్నారు. కానీ Type-2 డయాబిటిస్ కి కూడా అతిచిన్న వయసులోనే గురయిపోతున్నారు. దీనికి కారణాలు:

1. ఎక్కువ బరువుపెరగడం మరియు ఒబీసిటీ
2. మానసిక ఒత్తిడులు

డయాబిటిస్ ఉన్న పిల్లల్లో, టీనేజర్లలో ఎమోషన్లలో తేడాలు, ఎదుటివారితో చాలా తీవ్రము గా రియాక్ట్ అవుతుంటారు, ఆఖరికి స్కూలుకి వెళ్ళాలనే ధ్యాస కూడా తగ్గిపోతుంది.

ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ లో తేడాల వల్ల మానసిక పరమైన ఒత్తిడులకు గురి అయ్యి వంటరితనంతో బాధపడడము, భయం, చిరాకు, పబ్లిక్కులో ఉన్నప్పుడు సడన్ గా తనలో ఎనర్జీ అంతా పోయినట్లుగా కంగారు లాంటి లక్షణాలతో అనుక్షణము బాధపడుతుంటారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి లేదా టీనేజర్లకి ఫ్రెండ్స్ నుండీ, కుటుంబీకులనుండీ మరియు డాక్టర్స్ నుండీ కూడా తగు ఎమోషనల్ సపోర్ట్ పొందుతూ వుండాలి. అది కొంతవరకూ వారి కండిషన్ కి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుంది.

వేళకి తినడం, నిద్రపోవడం చెయ్యకపోయినా, ఎక్కువగా శరీరాకర్షణకు లోనయి విపరీతమైన డైట్ కంట్రోల్ చేసినా కూడా డయాబిటిస్ రావడానికి దోహదపడుతున్నది. అనవసరమైన డైట్ కంట్రోల్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్ లో తేడా వచ్చేసి డయాబిటిస్ టీనేజుల్లో వచ్చేస్తున్నది. అలాగే స్కూలు పిల్లల్లో కూడా సోషల్ వెబ్ సైట్ నెట్ వర్కింగు పై అన్న పానీయాలు మాని రాత్రీ, పగలు గడపడం వల్ల విపరీతమైన ఆలోచనా ధోరణలు, మానసిక ఒత్తిడులకు గురి అవ్వడంవల్ల కూడా బ్రెయిన్ కి వెళ్ళే గ్లూకోజ్ లెవెల్స్ లో తేడా వచ్చేసి హైపో గ్లైసీమియాకో, లేదా బ్రెయిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ లో తేడా వచ్చేసి, ఇన్సులిన్ సిగ్నలింగ్ పూర్తిగా దెబ్బతినో, శరీరం రక్తం లోని గ్లూకోజ్ ను తీసుకోవడం అనేది కుంటు పడుతున్నది. దీనివల్ల గ్లూకోజు శరీరభాగాలన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవ్వక, రక్తం లోనే మిగిలిపోవడం వల్ల డయాబిటిస్ కి దారితీస్తున్నది.

కొంతమంది టీనేజర్లు బరువు పెరుగుతున్నామనో లేదా బరువు తక్కువవున్నామనో ఇంజక్ష్న్లద్వారా గ్లూకోజ్లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటూ... శరీరాకృతిని తీర్చిదిద్దుకుంటారు. ఇది రాను రాను డయాబిటిక్ కీటొ ఎసిడోసిస్ (Diabetic Ketoacidosis) (బ్లడ్ లోనూ, యూరిన్ లోనూ కీటోన్స్ ని ఉత్పత్తి చెయ్యడం) కు దారి తీస్తుంది. దీనివల్ల ప్రాణాలు పోయే అవకాశం కూడా వుంది. కళ్ళకి, మూత్రపిండాలకి డామేజ్ ని తీసుకువస్తుంది.

డయాబిటిక్ కీటొ ఎసిడోసిస్ అనేది చాలా ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి. ఈ స్థితి లో ఎక్కువ మోతాదులో రక్తంలో యాసిడ్లు ఉత్పత్తవుతాయి. ఇన్సులిన్ గనుక శరీరానికి సరిపడా లేనప్పుడు రక్తం లోని గ్లూకొజ్ బ్రేక్ డవున్ కాదు. మరి కండరాలకి, ఇతర కణజాలాలకి ఎనర్జీ ఎలా గ్లూకోజ్ లేనప్పుడు? Alternative గా శరీరం క్రొవ్వు ని బ్రేక్ డవున్ చెయ్యడం మొదలుపెడుతుంది ఒక energy source గా ఉపయోగించుకోవడానికి.  ఈ process లో విషపూరితమైన యాసిడ్లు రక్తం లో ఉత్పత్తవుతాయి. డయాబిటిస్ ను కలిగివున్నవారు లేదా డయాబిటిస్ కి దగ్గరలో వున్నవారు తప్పనిసరిగా డయాబిటిక్ కీటోఎసిడోసిస్ గురించి తెలుసుకొని వుండాలి. ఎందుకంటే దీని రిస్క్ వాళ్ళకి తప్పకుండా వుంది కనుక. కీటోసిస్ అకస్మాతుగా develop అయ్యే అవకాశం వుంది.  దీని లక్షణాలేమిటంటే...

1. ఎక్కువ దాహం
2.ఎక్కువ యూరినేషన్
3.తలతిరగడం, వాంతి
4.పొత్తి కడుపులో నొప్పులు
5.విపరీతమైన అలసట
6.ఊపిరితీయడం కష్టమవ్వడం
7.తీపు వాసన పళ్ళనుండి
8.confuse అవ్వడం

రక్త లేదా మూత్ర పరీక్షలద్వారా కీటోన్ల లెవెల్ ను కనుక్కోవచ్చు.

గ్లూకోజ్ లెవెల్స్ ని ఎలా మేనేజ్ చెయ్యాలంటే….. తగు జాగ్రత్తలు తీసుకోవడమే.

1. హైపో గ్లైసీమియా తో బాధపడుతున్న టీనేజర్సు ఆల్కహాల్ ని తీసుకోరాదు. ఆల్కహాల్ లివర్ నుండి గ్లూకోజ్ ని బ్లడ్ లోకి రిలీజ్ చెయ్యడాన్ని ఆపేస్తుంది.

2. హైపోగ్లైసీమియా కండిషన్ ని రివర్స్ చెయ్యడానికి గ్లూకాగన్ అనే ఇంజక్షన్ ని ఇస్తారు. ఆల్కహాల్ తీసుకుంటే అది పనిచెయ్యదు.

3. పొగత్రాగుట పనికిరాదు ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని ఎక్కువ చేసేస్తుంది అలాగే పొగాకు ఇన్సులిన్ నిరోధిస్తుంది. ఆదోవన స్ట్రెస్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేస్తాయి.

4. అలాగే బాడీ టాటూలు, బాడీ పియర్సింగులు పనికి రాదు, డయాబిటిస్ తో బాధపడేవాళ్లకు ఈ టాటూలు, పియర్సింగులవల్ల బాడీ ఇన్ ఫెక్ట్ అవుతుంది.

ఇలా తగుజాగ్రత్తలు తీసుకుంటూ మ్యానేజ్ చేసుకోవలసిందే. 

Type 3 డయాబిటిస్

ఇన్సులిన్ pancrease లోనే కాదు, బ్రెయిన్ లో కూడా ఉత్పత్తవుతుంది. బ్రెయిన్ ఇన్సులిన్ ఉత్పత్తి లో తేడాలొచ్చినపుడు ఐద్ ఆల్జీమర్స్ అనే బ్రెయిన్ వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధి వల్ల మనిషి తన జ్ఞాపకశక్తిని, తెలివితేటలను మర్చిపోతాడు. అంతే కాకుండా తన వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోతాడు. యొక్క ఎక్స్ ఈ డయాబిటిస్ అని చెప్పుకోవచ్చు.   కూడా కు వున్న రోగ లక్షణాలని కలిగివుంటుంది కాకపోతే అది బ్రెయిన్ లో. బ్రెయిన్లోని నరాలు గ్లూకోజ్ ని తీసుకోవడానికి బ్రెయిన్ ఇన్సులిన్ దోహదపడుతుంది. ఆ ఇన్సులినే లేనప్పుడు ఈ ప్రక్రీయ జరగదు కాబట్టి ఆల్జీమర్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ విధమైన మెదడు వ్యాధి రాను రాను ముదిరి, ఆ మనిషిని తన దైనందిన జీవితానికి పూర్తిగా దూరం చేసేస్తుంది. ఆ మనిషి తనేలోకంలో ఉన్నాడో తనకే తెలియని పరిస్థితిలో పడిపోతాడు. ఈ వ్యాధి ప్రధమ దశలో వుంటుండగానే తెలుసుకుంటే కొంతవరకు లైఫ్ స్తైల్ లో జాగ్రత్తలు తీసుకొని వ్యాధి లక్షణాలను కొంతవరకు మేనేజ్ చెయ్యవచ్చు. అయితే ఈ ఆల్జీమర్ వ్యాధి కేవలం డయాబిటిస్ వల్ల ప్రాప్తించేదికాదు. వంశపారంపర్యం వల్ల గానీ, రక్తపోటు కొలస్ట్రాల్ వల్ల గాని, ఈ డయాబిటిస్ వల్లగాని సెకండరీ ఎఫెక్ట్ గా వస్తుంది. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆహారం లో జాగ్రత్తలు తీసుకుంటూ ఆల్జీమర్ వ్యాధిని తగ్గించుకోవచ్చనే విషయం కనుగొనబడడం.

A link between diet-diabetes- so now Alzheimer’s disease



ఇప్పటి మన జీవన సరళి ఒక King size burger లాగ పెరిగిపోయింది. క్విక్ గా ఎనర్జీ ఇవ్వడానికి ప్రాసెస్డ్ ఫుడ్స్. కార్బోహైడ్రేట్ ఎక్కువ శాతం మరియు తక్కువ పోషకవులువలతో వున్న పదార్ధాలు, సోడాలు, క్యాండీ లు తినడం వల్ల శరీర కణాలలోని పనితనం స్థంభించిపోయి వ్యాధులను తట్టుకునే స్థాయిని కోల్పోతాయి. అందువల్ల ఆహారంలో హెల్తీ చాయిసెస్ ని అనుకరించాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, గోధుమ వటి హోల్ గ్రెయిన్స్, పీచు పదార్దాలు బ్రెడ్, సిరియల్స్, నట్స్, లెగ్యూము తినాలి. అలాగే చేపలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి వ్యాధి నిరోధకతని పెంచుతాయి. వార్ధక్యాన్ని కూడా డిలే చేస్తుంది. మంచి ఆహారం తో పాటుగా వ్యాయామం కూడా అవసరం, శరీర కణాల పనితనాన్ని మెయిన్ టెయిన్ చెయ్యడానికి. ఇక్కడ వ్యాయామం చెయ్యడానికి కీ ఏమిటంటే.. మనం ఏ వ్యాయామ క్రియని ఇష్టపడతామో దాన్ని కంటిన్యూ చెయ్యాలి, అప్పుడు కంటిన్యుటీ దెబ్బ తినదు. వ్యాయామం వలన లాభాలు మెండు. వ్యాధినిరోదకతను పెంచడమే కాకుండా, వ్యాధుల వల్ల వచ్చే రకరకాల వాపులను తగ్గిస్తుంది. మెదడుని చురుకుగా వుంచుతుంది. శరీరంలోని అన్ని భాగాలను సులువుగా ఫ్లెక్సిబుల్ గా వుంచుతుంది. అలాగే వాతావరణ కాలుష్యాలకి, విషవాయువులకు తక్కువ ఎక్స్ పోజ్ అవ్వడం కూడా చాలా అవసరం Type 3 డయాబిటిస్ మేనేజ్మెంట్ లో.