గౌతమి
Monday, January 18, 2016
Thursday, January 7, 2016
Monday, January 4, 2016
Saturday, January 2, 2016
పుస్తకానికీ ఒక మనసుంటుందా?
ఎందుకుండదు మనసులోని మాటే అక్షరాలుగా మారి పుస్తకమయినప్పుడు? ఈ పుస్తకం పేరు "తరాలు-అంతరాలు". అమ్మాయికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక అక్కడ మనుష్యులే కాదు, వాళ్ళు ధరించే విబ్భిన్న పాత్రలు ఆ పాత్రలతో ఈవిడకి సర్దుబాట్లు లేదా పోరాటాలు మొదలవుతాయి. ఓరిస్తే ఓరుగల్లంత పట్నం అంతే తప్ప గెలుపు ఓటమిలనేవి ఎవరికీ వుండదు. అందుకే "నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా, ఏ తీరుగనను దయజూచెదవో" అనే తత్వం పాడబడింది. ఈ విషయం అందరికీ తెలిసినదే. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే,
పదిహేడుమంది రచయిత్రులు వాస్తవకధలను చర్చిస్తూ, ఇక్కడ కధ అనేబదులు జీవితం అంటే బాగుంటుందేమో. ప్రతిజీవిత గాధనుండి ఒక క్రొత్త అంశాన్ని వెలికితీసి తమదైన బాణీలో, ఆలోచనా శైలితో వ్రాసి క్రొత్త ఆలోచనలని ప్రతిపాదించారు. చదివిన ప్రతిఒక్కరికీ, ఈ క్రొత్త ఆలోచనలు సాగే జీవిత రహదారిలో ఎక్కడోదగ్గిర ఉపయోగపడితే అంతకన్నా ఇంకేంకావాలి? అందుకే దీన్ని నేను ఒక ప్రయోగాత్మక కధల సంపుటి అని అంటాను.
చెప్పడం మర్చిపోయా, నేనూ కూడా ఒక జీవితకధని ఇందులో వ్రాశాను. ప్రతిఒక్కరూ ఈ పుస్తకాన్ని లింగభేదం లేకుండా తప్పకుండా చదవాలి. గ్రుడ్డిగా జీవితాల్లోకి అడుగుపెడతాం. ఆకస్మిక మార్పులకు, అనుభవాలకు అలసిపోతాం. ఇలాంటి పుస్తకాలు చదివేటప్పుడు ఏదో ఎక్కడో జీవితంలో ఇలాంటిదే జరిగినట్లుందే అని ఆశ్చర్యపోతాం. ఇలా మనకొక్కళ్ళకే కాదు, వేరే వాళ్ళకి కూడా జరుగుతున్నదన్నమాట, అయితే మనం వంటరివాళ్ళం కాము, అవతలివాళ్ళు ఎలాగయితే తట్టుకున్నారో, మనమూ తట్టుకోవాలనే దైర్యమొస్తుంది. ఇలాంటి పుస్తకాలు చదివితే అందులోని అంశాలను బట్టి క్రొత్త ఆలోచనలు పుంతలు వేసి, తీసుకునే నిర్ణయాలు మరింత మెరుగుపడతాయి, అందుకే మంచిపుస్తకం జీవితానికి అవసరం. అందుకే ఈ పుస్తకం మీ కోసం. దీన్ని పొందడానికి నవోదయా, విశాలాంధ్ర బుక్ షాప్లలో దొరుకుతుంది. లేకుంటే హైదరాబాదులో ఈ ఫోన్ నెం. 9494862254 లేదా 80963 10140 (సెల్) కి ఫోన్ చెయ్యండి, తక్షణం ఈ పుస్తకం మీ ముందుంటుంది. అమెరికాలో ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ చెయ్యండి. నా నెంబర్ 6108882724. హైదరాబాద్ ఫోన్నెంబర్లకు కాంటాక్ట్ చేయదలిచిన వాళ్ళు నా పేరు మెన్షన్ చెయ్యండి. థాంక్ యూ.
పుస్తకరూపం ఎలా వుంటుందంటే......
Subscribe to:
Posts (Atom)