Part- 2
అక్టోబర్ 25, 2014 న ఈ టాపిక్ ను మా సైన్స్ కబుర్లు అంతర్జాల రేడియో ప్రోగ్రాం "తెలుగు తరంగా" లో కూలంకషంగా శ్రోతలతో చర్చించాము.
హైపోథైరాయిడిజం అనేది ఒక శారీరక రుగ్మత. థైరాయిడ్ గ్రంధి యొక్క యాక్టివిటీ చాలా తక్కువగా ఉండి, అది ఉత్పత్తి చేయవలసిన అతిముఖ్యమైన హార్మోన్లనూత్పత్తి చేయకపోవడం వల్ల ఈ రుగ్మతకు దారితీస్తుంది.
అక్టోబర్ 25, 2014 న ఈ టాపిక్ ను మా సైన్స్ కబుర్లు అంతర్జాల రేడియో ప్రోగ్రాం "తెలుగు తరంగా" లో కూలంకషంగా శ్రోతలతో చర్చించాము.
హైపోథైరాయిడిజం అనేది ఒక శారీరక రుగ్మత. థైరాయిడ్ గ్రంధి యొక్క యాక్టివిటీ చాలా తక్కువగా ఉండి, అది ఉత్పత్తి చేయవలసిన అతిముఖ్యమైన హార్మోన్లనూత్పత్తి చేయకపోవడం వల్ల ఈ రుగ్మతకు దారితీస్తుంది.
దీని లక్షణాలేమిటి?
1. శరీరం లో జరిగే
అన్ని రసాయన చర్యలు అదుపుతప్పుతాయి.
2. ఒబీసిటీ, కీళ్ళనొప్పులు,
గర్భం రాకపోవడం, గుండె జబ్బులు లాంటివి వస్తాయి.
ఈ గ్రంఢి మెడకు
ముందర భాగలో అయివుంటుంది. ఇది రెండు ముఖ్యమైన హార్మోన్లు T3 (tri iodothyronine) మరియు T4 ( thyroxine) లను
ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు హామోన్ల యొక్క ప్రభావం అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే
క్రొవ్వు పదార్ధాలని విచ్చిన్నం చెయ్యడం. కార్బోహైడ్రేట్స్ ని విచ్చిన్నం చెయ్యడం,
శ్రీర ఎష్ణోగ్రతని బ్యాలెన్స్ చెయ్యడం, హుండే చప్పుడిని రెగ్యులేట్ చెయ్యడం, శరీరం
లో అనేక ప్రోటీన్ల తయారీ లో వుంటుంది.
హైపోథైరాయిడిజం
ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలేమిటి?
మొదటికారణం ఆటో
ఇమ్యూన్ డిసీజ్ వల్ల- ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లో ఇమ్యూన్ సిస్టం తన బాడీ టిష్యూస్
కి వ్యతిరేకం గా యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంధి కి కూడ
వ్యతిరేకం గా యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి.అప్పుడీ టి3 మరియు టి4 హార్మోన్లు ఉత్పత్తి
అవ్వవు. ఏ కొద్దో గొప్పో బ్యాలెన్స్ అయిన్నా కూడా జీవక్రియలను ముందుకు నడిపించలేవు.
రెండవ కారణం కంజెనైటల్
డిసీజెస్ వల్ల. పుడుతూనే థైరాయిడ్ గ్లాండ్ లో లోపము తో పుడతారు.
మూడవ కారణం పిట్యూటరీ
డిసార్డర్- అసలీ థైరాయిడ్ గ్లాండ్ టి3 మరియు టి4 ని ఉత్పత్తి చెయ్యాలంటే, ముందు థైరాయిడ్
గ్లాండ్ యాక్టివ్ గా ఉండాలి కదా. దీన్ని యాక్టివ్ గా ఉంచే హార్మోను థైరాయిడ్ స్టిమ్యులేటింగ్
హార్మోన్ (TSH). ఇది మెదడు లోని పిట్యూటరీ గ్లాండ్ నుండి స్రవిస్తుంది. ఈ పిట్యూటరీ డిసార్డర్
గనుక వుంటే హార్మొన్ ఉత్పత్తి కాదు, థైరాయిడ్ గ్లాండ్ కూడా పని చెయ్యదు.
నాల్గవ కారణం గర్భధారణ:
స్త్రీలు గర్భం ధరించింప్పుడు లోపల పిండం తయారీలో ఎక్కువ రసాయన చర్యలు జరుగుతుంటాయి.
వాటి గురించి థైరాయిడ్ గ్లాండ్ విపరీతంగా టి3 మరియు టి4 ని ఉత్పత్తి చెస్తుంది. మరి
ఏదైనా మోతాదును మించి తయారయినప్పుడు శరీరం లో ఆటోమేటిక్ గా డిఫెన్సివ్ మెకానిజములు
మొదలవుతాయి. అధిక మోతాదుల్లో ఉత్పత్తి అవుతున్నT3 మరియు T4 లకు ఇమ్యూం సిస్టం యాంటీబాడీస్
ని ఉత్పత్తి చేసి, ఆ హార్మోన్లను అరికట్టేస్తుంది. అయినా థైరాయిడ్ గ్రంధి దాని పని
అది చేసుకుంటూనే వుంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత
థైరాయిడ్ గ్రంధి నార్మల్ కండిషన్ లోకి వచేసి.. తగు మోతాగులోనే ఉత్పత్తి అవ్వాలి.
అలా తగు మోఅతాదుకు వచ్చినా కూడా ఇమ్యూన్ సిస్టం మాత్రం అటాక్ చెయ్యడం మానదు. ఎక్కువ
పాళ్ళల్లో అటాక్ చెయ్యడం వల్ల, ఆల్ రెడీ తక్కువ మోతాదుకు వచ్చేసిన థైరాయిడ్ పూర్తిగా
బ్లాక్ అయిపోతుంది. అది హైపోథైరాయిడిజం గా పరిణమిస్తుంది. దీనినే పోస్ట్పార్టం హైపోథైరాయిడిజం
అని అంటారు. దీన్ని గనుక ట్రీట్ చెయ్యకుండా వదిలేస్తే అబార్షన్లు లేదా ప్రీ మెట్యూర్
డెలివరీ లాంటివి జరుగుతాయి.
ఐదవకారణం ఐయోడీన్
లోపము- ఐయోడీన్ అనేది ఒక ట్రేస్ మినరల్. ఇది ముఖ్యం గా సీ ఫుడ్స్ లోనూ, సీ వీడ్స్ లోనూ,
ఐయోడిన్ ఎకువ వున్న భూమిలోనూ అలాగే ఐయొడైజ్డ్ ఉప్పులోనూ దొరుకుతుంది. ఐయోడీన్ థైరాయిడ్
ని యాక్టివేట్ చెయ్యడం లో ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాలలో భూముల్లో ఐయోడీన్ ఉండదు.
అటువంటప్పుడు ఐయోడీన్ వున్న టేబుల్ సాల్ట్ ని భోజన తయారీలో ఉపయోగుంచుకోవాలి.
ఈ హైపోథైరాయిడిజం
ఏ వయసువారికి వస్తుంది??
ఇన్ ఫాంట్స్: ఇన్
ఫాంట్స్ లో కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. దీనివల్ల వాళ్ళకి పచ్చకామెర్లు రావడం జరుగుతుంది.
ఎర్ర రక్త కణ్ణాలు బ్రేక్ అయిపోవడం వల్ల, ఆ అవ్శేషాలు సిస్టం నుండి సరిగ్గా ఫ్లష్ అవుట్
కాదు. దాని నుండి విడుదలయ్యే బైల్ రుబిన్ లివర్ లో మెటాబొలైజ్ కాదు. అది రక్తం లోనే
పసుపు పచ్చిని పిగ్మెంట్ గా ఉండిపోవడం వల్ల పచ్చకామెర్లకు దారితీస్తుంది. హైపోథైరాయిడిజం
వల్ల అంతేకాకుండా పిల్ల లు కూడా పొడి దగ్గుకి గురి అవుతారు.ముఖం కూడా బాగా వాచిపోతుంది.
పిల్లలు, టీన్సు:
వీళ్ళల్లో పెరుగుదల తక్కువగా కనిపిస్తుంది. పొట్టిగా వుంటారు. పెర్మనెంట్ టీత్ రావడం
ఆలస్యమవుతుంది. వాళ్ళు ఫుబెర్టీ కి రావడం కూడా ఆల్శ్యం అవుతుంది. మానసిక పెరుగుదల కూడా
వుండదు.
ఈ హైపోథైరాయిడిజం
రక్తప్రసరణ వ్యవస్థ, గర్భాశయ సమస్యలకు ఎలా దారితీస్తుంది?
దీనికి ఒక కేస్
స్టడీ ని షోలో డిస్కస్ చేశాము.
మహారాష్ట్ర లోని పూనె సిటీలో
ప్రసిద్దిచెందిన హాస్పిటల్స్ లో జహంగీర్ హాస్పిటల్ ఒకటి. ఇది గైనిక్ తో పాటు
మరెన్నో స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్. మనం పరిశీలించబోయే కేస్ స్టడీ ఇక్కడిదే. ఈ
పేషంటుకి దగ్గిర దగ్గిర 23 ఏళ్ళు ఉంటుంది. ఈమె మొదటిసారి గా ఎనిమిదేళ్ళ క్రితం బహిష్టులో
అధిక రక్తస్రావంతో బాధపడుతూ గైనకాలజిస్ట్ (స్త్రీ వైద్యనిపుణులు) ని కలిసింది.
మధ్య మధ్యలో తెరిపిచ్చినా, మళ్ళీ మొదలై నెల అంతా రక్తస్రావంతో బాధపడుతూ ఉండేది.
గర్భనిరోధక మాత్రలని వాడమని రాసిచ్చారు. ఈ మాత్రల వల్ల రక్తస్రావం తగ్గేది,
కాని దాని పర్యవసానం దానికి ఉండేది. మాత్రలలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టీరోన్
హార్మోనులు ఒక ప్రక్క రక్త స్రావాన్ని ఆపినా, మరో ప్రక్క అండం విడుదలని కూడా
ఆపుతాయి. ఈ పేషంటుకు, కొద్దికాలం తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ చేస్తే, ఆమె అండాశయం పై
చిన్న చిన్న కోశాలు లేదా సిస్టులు (అసామాన్యమైన పెరుగుదలలు) ఉన్నాయి. వాటిని
నివారించడానికి మళ్ళీ మరి కొన్ని మందులు రాశారు. పేషంటు ఈ తదుపరి పరిణామాలన్నీ
నివారించేందుకు ఆయుర్వేదపు మందులు కూడా కొన్నాళ్ళు తీసుకుంది. కానీ లాభం లేకుండా
పోయింది.
ఇక
కేసుని హిమటాలజిస్ట్ (రక్తవైద్యనిపుణులు) వద్దకు పంపించారు. వీరు చేసిన సాధారణ
పరీక్షల్లో శరీరంలో అంతర్గత రక్తస్రావం గాని, ముక్కునుండి రక్తస్రావం గాని
పేషంటుకి ఉన్నట్లు తేలలేదు. కాకపోతే రక్తహీనత, శరీరం నీరు పట్టడం, బరువు పెరగడం
తేలాయి. బ్లడ్ గ్రూపు AB+. ప్లీహము, ఉదరకోశము, లింఫ్ వ్యవస్థలు నార్మల్ గా
ఉన్నాయి. లోతైన పరీక్షలుచేస్తే, సూదితో చర్మంపై గుచ్చిన తర్వాత రక్తం దానంతట అదే
సహజంగా ఆగిపోవు వ్యవధి 2 నిముషాల 1 సెకను, నార్మల్ గా ఉంది (నార్మల్ రేంజ్ 1-9
నిముషాలు). అంటే రక్తపళ్ళెరాల పనితనంలో లోపం లేదు, హీమోస్టాసిస్ ప్రాధమిక చర్య
నార్మల్ గా ఉంది. దానితో పాటుగా జరిగే ద్వితీయక చర్య ‘కోయాగ్యులేషన్ లో తేడా
కనబడింది. అంటే రక్తస్రావం దానంతట అదే ఆగిపోవడానికి పట్టే వ్యవధి 11-13.5 సెకన్లు
ఉండాలి. కాని ఈ పేషంటుకు 6 నిముషాల 4 సెకన్లు పడుతున్నది. మరికొన్ని పరీక్షలు
చేయగా మరిన్ని వివరాలు బయటపడ్డాయి. Von Willibrand Factor లేదా VWF (వాన్-విల్లీ
బ్రాండ్ ఫేక్టరు/ప్రోటీను) బ్లడ్ ప్లాస్మాలో తక్కువ మోతాదులో ఉంది. అవటుగ్రంధి
ఉత్పత్తి చేసే హార్మోన్ల లెవెల్స్ కూడా తక్కువ గా ఉంది. దీనిని హైపోథైరాయిడిజం (hypothyroidism) అంటారు. చివరికి పేషంటుకు హైపోథైరాయిడిజం వల్ల
వచ్చిన వాన్-విల్లీ బ్రాండ్ వ్యాధి’ అని తేల్చారు.
VWF బ్లడ్ ప్లాస్మాలో ఉండే
గ్లైకో ప్రోటీను. ఇది బోన్ మేర్రో (Bone marrow) లోని పెద్ద కణాలైన మెగా
కార్యోసైట్స్ (megakaryocytes) లో ఉత్పత్తి అవుతుంది. కాలేయం (liver) లో ఉత్పత్తి
అయ్యే కోయాగ్యులేషన్ ఫేక్టర్ VIII తో బైండ్ అయ్యి, కోయాగ్యులేషన్ లో
పాల్గొనేటప్పుడు ఫేక్టర్ VIII కు స్థిరత్వాన్ని ఇస్తుంది. మరి ఆ VWF ఉత్పత్తి
లేనప్పుడు, ఫేక్టర్ VIII కు స్థిరత్వం లోపించి కోయాగ్యులేషన్ లో పాల్గొనలేదు,
ఫలితంగా కోయాగ్యులేషన్ పూర్తిగా జరుగదు, ఇటువంటి ఫాక్టర్లు మరి కొన్ని
కోయాగ్యులేషన్ లో పాల్గొన్నప్పటికీ కూడా. అంతేకాకుండా, ఈ VWF కు ప్రాధమిక
హీమోస్టాసిస్ (రక్తం గడ్డకట్టుట) లో కూడా కీలక పాత్ర ఉంది. రక్తపళ్ళెరాలు ఒకదానితో
ఒకటి మరియు అవన్నీ కలసి ధమని చిట్లిన చోట VWF సహాయంతో సమూహకరిస్తాయి. VWF
లోపిస్తే రెండు చర్యలూ దెబ్బతిని రక్తస్రావమాగదు. ఈ పేషంటు విషయం లో సరిగ్గా
ఇదే జరిగింది. ఈమె రక్తపరీక్షలలో VWF ఉత్పత్తి తక్కువ కనబడింది,
రక్తస్రావమాగడానికి ఎక్కువ కాలం కూడా పట్టింది. తరువాతి పరీక్షల్లో బ్లడ్ లో
ఫేక్టర్ VIII యొక్క అస్థిరత్వాన్ని కూడా సూచించారు.
అవటు
గ్రంధి మెదడులోని పిట్యూటరీ గ్రంధి వలన పని చేస్తుంది. అవటుగ్రంధి నుండి
ఉత్పత్తి అయ్యే హార్మోనులు శరీరంలోని అన్ని జీవక్రియల్లోనూ పాల్గొని వాటిని
క్రమపరుస్తాయి. అలానే బోన్ మార్రో లోని ఉత్పాదనలు- VWF తో సహా అవటు గ్రంధి పైనే
ఆదారపడిఉంది. ఈ పేషంటుకు, అవటుగ్రంధి హార్మోన్ల ఉత్పత్తి కూడా తక్కువ గా ఉండడం
వలన, ఈ VWF లెవెల్స్ తగ్గిపోయాయి. దీనివల్ల ఫేక్టర్ VIII యొక్క అస్థిరత్వము మరియు
కోయాగ్యులేషన్ ప్రక్రీయలో లోపము పెరిగిపోయి, ప్రతినెలా వచ్చే ఋతుచక్రంలో
రక్తస్రావమాగలేదు. గర్భసంచిలో ఏ లోపమూ లేకపోయినా గర్భాశయపు సమస్యను
తెచ్చిపెట్టింది. వెంటనే వైద్య చికిత్స గా ఆమెకు రక్తహీనతను పోగొట్టడానికి, రక్తం
ఎక్కించారు. హైపో థైరాయిడిసం పోవడానికి, ప్రతిరోజూ ఓరల్ గా థైరాయిడ్ మాత్రలు
వేసుకోమని రాసిచ్చారు. ఆరు నెలల్లో పేషంటు యొక్క పరిస్థితి మెరుగయి, అధిక రక్త
స్రావం తగ్గింది. ఆమె ఆరోగ్యవంతురాలయ్యింది. ఈ రోగనిర్దారణే సరిగ్గ
జరగకపోయినట్లయితే, గర్భసంచిని తొలగింపవలసిన పరిస్థితి ఏర్పడేది. హైపో థైరాయిడిసం
వలన రక్తవ్యవస్థకే కాదు ఇతర జీవ క్రియలకు కూడ సమస్యలు వచ్చి మనిషి ప్రాణానికి
ముప్పు వచ్చేది.
No comments:
Post a Comment