గౌతమి

గౌతమి

Monday, January 26, 2015

మధుమేహం లేదా చక్కెర వ్యాధి (Insights of Diabetes)

Part 2

ఇన్సులిన్ సెన్సిటివిటీ (Insulin sensitivity) మరియు ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance): 



Part I లో ఒబీసిటీ ద్వారా ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance), ఆ పై డయాబిటిస్ సంప్రాప్తించడం అనేది తెలుసుకున్నాం. Part 2 లో ఇన్సులిన్ సెన్సిటివిటీ (Insulin sensitivity) యొక్క ఆవశ్యకతను తెలుసుకుందాము.

మనం తీసుకునే ఆహారంలో క్రొవ్వు పదార్ధాలు (fats), ప్రోటీన్లు (proteins) మరియు పిండి పదార్ధాలు (carbohydrates) వుంటాయి. ఈ ఆహారం జీర్ణక్రియ ద్వారా మరలా ప్రోటీన్సు (proteins) గా, సూక్ష్మపోషకాలు (micronutrients) గా, శక్తిని కలుగజేసే పదార్ధం గ్లూకోజ్ గా విచ్చిన్నమవుతుంది. ప్రోటీన్లను, సూక్ష్మ పోషకాలను కణాల జీవక్రియ (cellular metabolism) లలోనూ, వ్యాధి నిరోధక విధుల (immune functions) లోనూ, కణాల భర్తీ (Cell replacement) లోనూ శరీరం ఉపయోగించుకుంటుంది. గ్లూకోజ్ ని శరీరానికి శక్తినిచ్చే ఇంధనం గా వాడుకుంటుంది. ఆ ఇంధనం రక్తం ద్వారా ప్రతి ఒక్క కణజాలానికి వెళ్ళి వాటికి శక్తిని కలుగజేస్తుంది. ఈ ఇంధనం యొక్క ఆవశ్యకత టైం టు టైం కణజాలాలకు మారుతుంది. ఉదాహరణకి పరిగెత్తినప్పుడు ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది కాబట్టి, ఎక్కువ గ్లూకోజ్ వినియోగ పడుతుంది, ఇతరసమయాల్లో కన్నా. కానీ మెదడుకి మాత్రం స్థిరంగా గ్లూకోజ్ లెవెల్స్ అందుతూవుండాలి. అంటే మెదడికి అన్ని సమయాల్లోనూ ఒకే మోతాదు లేదా లెవెల్లో గ్లూకోజ్ ద్వారా ఎనర్జీ అందుతుండడమనేది చాలా ముఖ్యమైన విధి. ఈ విధిని నిర్వహించడానికే ఇన్సులిన్ ముఖ్యపాత్రని వహిస్తుంది. ఎలా అంటే.. రక్తంలోవున్న గ్లూకోజ్ ని శోషించమని ఇన్సులిన్ కణాలకి సిగ్నల్స్ ని ఇస్తుంది.  మనశరీరం మనం తీసుకున్న ఆహారం, దానినుండి తయారయిన గ్లూకోజు రక్తంలో కలిసి వివిధభాగాలకు ప్రయాణించడమే కాకుండా ఏ కణానికి ఎంత గ్లూకోజు కావాలనేదాన్ని కూడా మానిటర్ చేస్తూ వుంటుంది. దీనికి తగ్గట్టుగానే ఇన్సులిన్ ని కూడా కరెక్ట్ టైం లో కరెక్ట్ మోతాదులో కణాలకి గ్లూకోజ్ ని శోషించడానికి సిగ్నల్స్ ని ఇవ్వడానికి రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులినే గనుక తన విధిని నిర్వర్తించని పక్షంలో అనగా కణాలకి సిగ్నల్స్ ని అందివ్వకపోయినా.. కణాలు గ్లూకోజ్ ను రక్తం నుండి తీసుకోవు. దీనినే ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance) అంటారు. దీనివల్ల కణాలు ఆహారం లేక శుష్కించడమే కాక, గ్లూకోజ్ వినియోగింప బడకపోవడం వలన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంది. ఇదంతా ఒక మెషినరీ. ఒకదాని ప్రభావం మరొక దానిపై పూర్తిగా వుంటుంది. వీటిలో ఏ ఒక్క విభాగం పనిచెయ్యక పోయినా మొత్తం మొదటికే మోసం వస్తుంది. 
ఇన్సులిన్ నిరోధకత వల్ల కణాలకు ఆహారం దొరకక పోయేసరికి ఆకలి వేస్తోందని, దాహం అలసట కలుగు తున్నాయని మెదడు సిగ్నల్ ని పంపిస్తుంది. వెంటనే మనిషి దాని ప్రకారం తింటుండవచ్చు, త్రాగుతుండవచ్చు అయినా కూడా ఇన్సులిన్ సిగ్నలింగ్ లో తేడా రావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి డయాబిటిస్ కి దారితీస్తుంది. దీనినే మెటబాలిక్ సిండ్రోము అని అంటారు. 20 ఏళ్ళక్రితం మెటబాలిక్ సిండ్రోము అంటే ఐడియావుండేది కాదు. ఈ రోజున ఇది డయాబిటిస్ కి మూలం అని తేలిపోయింది. ఇది డయాగ్నోస్ అవ్వడానికి ముందుగా మనిషిలో వచ్చే మెటబాలిక్ డిసార్డర్స్ ని పేషంట్లో కనుక్కోవాలి- అవి ట్రై గ్లిసెరైడ్స్ పెరుగుదల, కొలెస్టెరాల్ పెరుగుదల, రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల, రక్తపోటు. వీటన్నిటికీ సెల్ సిగ్నలింగ్ లో తేడా రావడమే మూల కారణం.

ఇన్సులిన్ మరియు స్త్రీ హార్మోనులు:

ఈ సందర్భంలో స్త్రీలలో ఇన్సులిన్ నిరోధకత వల్ల హార్మోనల్ తేడా లు ఎలా వస్తాయో చెప్పుకోవడం ముఖ్యం. స్త్రీ హార్మోన్లన్నీ వినాళికా గ్రంధి వ్యవస్థ (endocrine system) తో ముడిపడివుంది.  కాబట్టి వీటిలో ఒకటి పనిచెయ్యకపోయినా మరొకటి బ్యాలన్స్ తప్పడం అనేది పరిపాటి. అలాంటిదే డయాబిటిస్ మరియు స్త్రీ లలో మెనోపాజ్. ఇన్సులిన్ ఈస్ట్రోజెన్, టెస్టోస్టీరాన్, డీహైడ్రోఎపీయాండ్రోస్టీరోన్ మరియు థైరాయిడ్ హార్మోన్లతో సంకర్షిస్తుంది. ఇన్సులిన్ గనుక బ్యాలన్స్ తప్పితే స్త్రీ హార్మోన్లు సరిగ్గా పనిచెయ్యవు, మెనోపాజ్ త్వరితంగా సంభవిస్తుంది. దానిని పెరీమెనోపాజ్ (perimenopause) అంటారు. పూర్ క్వాలిటీ ఇన్సులిన్ వల్ల టైప్ 2 డయబిటిసే కాదు, సెక్స్ హార్మోనులు బ్యాలన్స్ తప్పుతాయి మరియు మిగితా జీవక్రియలన్నీ దెబ్బతింటాయి. అందువల్ల స్త్రీలు తప్పని సరిగా అప్పుడప్పుడు ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అదే ముఖ్యం గా బ్యాలెన్సెడ్ డైట్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హై క్వాలిటీ ప్రోటీన్లు, క్రొవ్వు పదార్ధాలు తీసుకుంటూవుండాలి. ఇది ఇన్సులిన్ తయారీకి ముఖ్యం. 

పెరీమెనోపాజ్ తో బాధపడుచున్న ఆడువారిలో ఇన్సులిన్ నిరోధకత కనిపిస్తున్నదట. పెరీమెనోపాజ్ తో బాధపడుచున్నవారిలో హాట్ ఫ్లాషెస్ (ఆకస్మికంగా వంట్లో వేడిని ఫీల్ అవ్వడం) చాలా పరిపాటి. పెరీ మెనోపాజ్ లక్షణాలని ట్రీట్ చెయ్యడానికి ముందు ఇన్సులిన్ ని బ్యాలన్స్ లో పెట్టాలి. ఇన్సులిన్ నిరోధకతను హీల్ చెయ్యకుండా పెరీ మెనోపాజ్ ని ట్రీట్ చెయ్యడం అసాధ్యం. ఇన్సులిన్ నిరోధకత డయాబిటిస్ కు, మెనోపాజ్ ప్రాబ్లంస్ కే కాకుండా గుండె జబ్బులు, బ్రెస్ట్ క్యాన్సర్, ఆల్జీమర్స్ లాంటి బ్రెయిన్ వ్యాధులు, పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోము కు కూడా కారణ భూతమవుతుంది. కొంతవరకు ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్ కి కూడా ఇన్సులిన్ నిరోధకత దారితీస్తున్నదని దాఖలాలు కనిపిస్తున్నాయి.

ఇన్సులిన్ నిరోధకత క్రొవ్వు మెటబాలిజాన్ని కూడా దెబ్బ తీస్తుంది. కణాలు గనుక రక్తం లోని ఎక్కువైన గ్లూకోజ్ ని వినియోగించుకోని పక్షంలో లివర్ ఆ గ్లూకోజ్ ని క్రొవ్వుగా మారుస్తుంది. క్రొవ్వులో గ్లూకోజ్ నిలవవుంటుంది. అందువల్ల క్రొవ్వుకణాల నిండా గ్లూకోజ్ రిసెప్టర్లు ఉంటాయి. అందువల్ల ఇన్సులిన్ నిరోధకత తో బాధపడుచున్న స్త్రీ క్రొవ్వు వలన బరువు పెరగడమే కాక గ్లూకోజ్ దొరకక కణాలన్నీ శుష్కించడం వల్ల అలసటకు, శక్తివిహీనతకు గురి అయ్యి ఎక్కువగా పిండిపదార్ధాల ఆహారాన్ని తీసుకునే టెండన్సీ పెరుగుతుంది. అంటే ఇక్కడ సహజ సిద్దంగా ఎలాగూ fat metabolism జరుగుతుంది, కానీ ఈ ఎక్స్ ట్రా గ్లూకోజ్, క్రొవ్వు గా మారడంవల్ల ఎక్స్ ట్రా క్రొవ్వు శరీరం లో పేరుకుపోతుంది. క్రొవ్వు కణాలు ఈస్త్రోజెన్ ఉత్పత్తి కారకాలుకూడ. అందువల్ల.. ఈ స్త్రీలలో ఈస్ట్రోగజెన్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యి, పెరీమెనోపాజ్ ఎర్లీ స్టేజ్ లో చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.   సహజ సిద్దం గా మెనోపాజ్ దగ్గిరపడినవాళ్ళల్లోకూడా ఎడ్రినల్ మరియు థైరాయిడ్ హార్మోన్స్ లో తేడాలు వచ్చి ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది.

ఇన్సులిన్ నిరోధకతను ఎలా నివారించవచ్చు?

ఇన్సులిన్ నిరోధకత ఒబీసిటీ వాళ్ళలోనే కాదు, సన్నగా ఉన్నవాళ్ళలో కూడా వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం లో ఎక్కువ శాతం రిఫైన్ డు కార్బోహైడ్రేట్లు అంటే వైట్ బ్రెడ్, షుగర్, పాస్టా, పొటాటో, కోక్/పెప్సీ, ప్రోసెస్ డ్ ఫుడ్ మొదలైనవి. ఎంత ఎక్కువ రిఫైన్ డు లేదా ప్రాసెస్ డు ఫుడ్ తీసుకుంటే అంత ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాల్సివుంటుంది, ఆ ఫుడ్డుని మెటాబొలైజ్ చెయ్యడానికి. రాను రాను రక్తములో ఎక్కువ ఇన్సులిన్ వుండిపోయిందంటే..అంత తక్కువగా కణాలు గ్లూకోజ్ ని శోషించుకుంటున్నాయన్న మాట. వయసుపోతున్నకొలదీ కూడా ఆ ప్రోసెస్ డ్ ఫుడ్ మెటాబొలైజ్ అవ్వడం పూర్తిగా కుంటు పడి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పూర్తిగా దెబ్బతింటుంది.

అధిక కొలెస్టెరాల్, అధిక ట్రై గ్లిజెరైడ్స్, రక్తపోటు ఉన్నవాళ్ళల్లో ఇన్సులిన్ నిరోధకతకు అవకాశం వుంది, దీనికి వయస్సు, బరువు తో సంబంధం లేదు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వున్న వాళ్ళల్లో కూడా ఇన్సులిన్ నిరోధకత అవకాశం వుంటుంది, బ్లడ్ ప్రెషర్ వేసుకునే మందులు ఇన్సులిన్ నిరోధకతను నివారించవు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

మంచి డైట్. చికెన్, గ్రుడ్లు, పాలు, ఎక్కువ ఫైబర్ వున్న ధాన్యాలు, వెజిటబుల్స్, లెగ్యూము, ఆకుకూరలు, పళ్ళు.
రోజూ కనీసం 30 నిముషాల పాటు ఎక్సర్సైజ్.
మానసిక వత్తిడులకు దూరం గా వుండడం
పొగ త్రాగకూడదు, ఆల్కహాల్ మోతాదును చాలా తగ్గించాలి.

మంచి నిద్ర.   

Thursday, January 15, 2015

ఎప్పటికప్పుడు, ఏ జన్మకాజన్మ లో కర్మవిముక్తులు కావాలంటే చెయ్యవలసినది ఒకటే !!!!

పూర్వపు జన్మమే, భవిష్యత్తు ఎలా కాగలదు?

బాబా గారు చెప్పినది: మరణసమయం లో ఉన్న కోరిక గాని, ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును మరు జన్మ లో నిర్ణయిస్తుంది.

భగవద్గీత (8వ అధ్యాయం) లో  శ్రీకృష్ణుడు చెప్పినదీ ఇదే. ఎవరైతే వారి అంత్యదశలో తనను జ్ఞాపకం ఉంచుకుంటారో, వారు తనను చేరుతారు. ఎవరైతే ఏదో మరోదానిని ధ్యానిస్తారో, వారు మరు జన్మలో దాన్ని పొందుతారు.

బాబా గారి మార్గాన్ని అనుసరించి యోగులైన వారి బోధనామృతం:

ఒక వ్యక్తి, ఒక స్త్రీ ని వివాహమాడి నానా ఇబ్బందులకు గురి అవుతుంటాడు. ఆ స్త్రీ వ్యసన పరురాలు మరియు నోటి దురుసు గలది.  స్వార్ధబుద్దితో, అహంకారం తో భర్తను తూలనాడుతూ బానిసను చేసుకుని బ్రతుకుచుండెను. ఏనాడూ ఆతనిని అనురాగముతో చూచెడిది కాదు. ఆతని కుటుంబీకుల మధ్య చూచుచున్నటుల నటించెడిది. తన ప్రవర్తనను ఎవ్వరికినీ చెప్పకూడదని భర్తను బెదిరించెడిది. తన పైననే ఆధారపడి ఆతను బ్రతుకునటుల చేసినది. తాను విటులతో చరిస్తూ, సుఖవ్యాధులపాలయి కొన్నాళ్ళకి మంచం పట్టి మరణించినది. ఆమె మరణానికి ముందు పిచ్చిది కూడా అయిపోయి భర్తని తిడుతూ, కొడుతూ అతని చేత అష్ఠాధి చాకిరీలు చేయించుకున్నది. చివరికి అతని కుటుంబీకులకు, స్నేహితులకు తెలిసి, అతని పరిస్థితులకు విస్తుపోయి, సహాయ సహకారాలందించ ప్రయత్నించిరి. అతనికి ఒక ఉద్యోగమును చూసి పెట్టిరి. ఇంతలో మరొక స్త్రీతో పరిచయమయి, అది ప్రణయం గా మారి వివాహానికి దారి తీసినది. ఈ రెండవ స్త్రీ ఎంతో అనురాగము తో చూసుకొనేది. అతని పూర్వపు జీవితానికి పూర్తి భిన్నం గా ఉన్నది ఈ రెండవ స్త్రీ తో. ఆమె అతని మనసుని నొప్పించకుండా గౌరవిస్తూ, దైవ భక్తి కూడా కలిగినది అయి... సంతోషముగా జీవించినది.

ఈ కధలో అతని మొదటి జీవితం.. అతని పూర్వ జన్మల కర్మల ఫలితము, ఒక వ్యసనపరురాలి క్రింద బానిస సంకెళ్ళు. కర్మానుసారె బుద్ది, కావున అ స్త్రీ ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు, బానిస బ్రతుకూ అనుభవించాడు..ఆ కర్మలు పూర్తయి సంకెళ్ళు విడిపోయినవి.  ఆ స్త్రీ యొక్క నీచ ప్రవర్తనకు దేవుడు వేసిన శిక్ష వ్యాధిగ్రస్తురాలయి, అందరిచేత చీ.. అనిపించుకుని, పిచ్చిది అయి, కుక్క చావు చనిపోయినది.

ఇక లభ్యమయిన రెండవ జీవితం.. బహుశా అదే అసలు జీవితం. ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం కావచ్చు లేదా పూర్వపు జన్మలో ని అతని సహచరిణి యే మళ్ళీ ఈ జన్మలో లభ్యమయి ఉండవచ్చు. మళ్ళీ సుఖ సంతోషాలతో, అనురాగం తో ఈ జన్మలోనూ జీవించి ఉండవచ్చు.

భక్తుని ప్రశ్న: పూర్వపు జన్మమే, భవిష్యత్తు ఎలా కాగలదు?

అవే పాప పుణ్యాల ఫలితాలు. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. అలానే మరణ సమయము లో ఎవరిపైన ధ్యాసతో, వేదనతో ప్రాణం విడుస్తారో..ఆ అలోచనే, ఆ ధ్యాసే మరు జన్మలో భవిష్యత్తు అవుతుంది.

ఇక్కడ అతనికి లభ్యమయిన మొదటి స్త్రీ.. అతడు ఏఏ జన్మల్లోనో చేసుకున్న కర్మ ఫలం. రెండవ స్త్రీ అతని పూర్వ జన్మము నుండి తెచ్చుకున్న భవిష్యత్తు!  ఈ రెండు విషయాలు ఆ వ్యక్తి జీవితంలో కనిపించిన విషయాలే. ఇందులో తప్పేదేముంది..అంటే ఏదీ లేదు. ఒక ఆత్మయొక్క గతమైనా, వర్తమానమైనా ఆ ఆత్మనే అంటిపెట్టుకునివుంటుంది. అది శరీరాన్ని త్యజించి మరో క్రొత్త శరీరం లోకి ప్రవేశించినా కూడా దాని గతాలు మళ్ళీ భవిష్యరూపంలో తటస్థిస్తుంది. మరణ సమయంలో ఏ వ్యక్తిపైననో, ఏ కోరికతోనో, ఏ ఆలోచనతోనో శరీరాన్ని త్యజించినా కూడా అది మరుజన్మలో పొందడం జరుగుతుంది. ఇదే మానవులకు అర్ధం కాని దేవుని లీలలు!!!!

భక్తుని ప్రశ్న: మరి ప్రతి జన్మలోని గతం తాలూకు నీలినీడలు.. క్రొత్త జన్మలలో ఏదో బ్యాంకు బాలెన్సు లాగ..సంప్రాప్తించి కర్మలకు గురి అవుతుంటే..భవిష్యత్తుని ఎప్పుడు సంపూర్ణం గా అనుభవించగలము?

అప్పుడు బాబా గారి దగ్గిరనుండి తరచూ వచ్చే ఒక క్లిష్టమైన సమాధానం చర్చించక తప్పదు.

బాబాగారు ఎప్పుడూ కష్టాలను ప్రేమించమంటారు. ఇదెక్కడి చోద్యం? ధు:ఖాన్ని కలిగిస్తున్నా కష్టాలని ప్రేమించగలమా? ఆయన అర్ధం ఏమిటంటే.. ప్రేమలో ఉండాల్సిన సర్వసాధారణ లక్షణాలు శ్రద్ద, ఓర్పు రెంటినీ కష్టం యందు పెంచుకోమంటారు. ఆరెండే.. ఆ కష్టం యందు అవగాహనని పెంచి ఎదుర్కోవడానికి దైర్యాన్ని, స్థైర్యాన్నిఇస్తుందంటారు. ఇక్కడ ప్రేమకున్న విలక్షణమైన గుణాలను వివరిస్తూ.. అటువంటి ప్రేమను, పడుతున్న కష్టం యందు వెచ్చించమంటారు. అప్పుడే ఆ కష్టం యందు అవగాహన కలిగి, దానిని సృష్టించిన వారియందుకూడా విచారణ శక్తి పెరిగి, శ్రద్ధ ఓర్పుతో సమస్యలను విడదీసి.. దైర్యం, స్థైర్యం తో ఎదుర్కొని కర్మలను పూర్తిచెయ్యగలరని చెప్తారు. ఇదంతా కేవలం ప్రేమతోనే సాధ్యం అంటారాయన. అందుకే బాబా గారికి "ప్రేమ సాయి" అని పేరు. ఆయన తన భక్తులని ప్రేమిస్తూనే వుంటారు, అంటే కేవలం వరాలివ్వడమేకాదు. కష్టాలతో కొట్టుమిట్టాడు తున్నవాళ్ళలో ప్రేమని నింపి, దానికున్న విలక్షణమైన గుణాలన్నీ సదరు బాధితుడికి అందిస్తూ..కర్మలను పూర్తిచేయిస్తూ విముక్తిడిని చెయ్యడమే గురు లక్షణం.

ఎప్పటికప్పుడు, ఏ జన్మకాజన్మ లో కర్మవిముక్తులు కావాలంటే చెయ్యవలసినది ఒకటే- ఆ కర్మలను పూర్తిచేసుకోవడం. అది ఏ కారణం చేతనైనా కుదరకపోయినా, ఏ బలవన్మరణాలవల్లనో మధ్యలో ఆగిపోయినా.. మళ్ళీ జన్మలో అవే సమస్యలు పున: ప్రారంభమై, గత జన్మలోని శత్రు శేషంచేతనే బాధింపబడవలసివుంటుందట. అందుకే.. ఏ కష్టమున్నా కూడా పంటి బిగువున పట్టి పూర్తిచెయ్యమంటారు. అందుకు తాను పూర్తి సహాయకారిగా ఉంటానంటారు. దానికి ప్రతిఫలం గా బాబాగారు మననుండి కోరుకునేది ఒక్కటే.. తన మీద శ్రద్ద, సబూరి. చూశారా? ఇంతకన్నా బరోసా ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరైనా ఇవ్వగలరా ? ఒక్క బాబాగారు తప్ప !!!!!


Sunday, January 11, 2015

సెల్ఫీ తో కుల్ఫీ!!!

సెల్ఫీ అనగానేమి?
సెల్ఫీ అనగా సెల్ ఫోన్లో వుండే కెమేరాతో ఇతరుల సహాయం అర్ధించకుండా  తనకు తాను ఫొటో తీసుకోవడం ముఖం అటుతిప్పో, ఇటుతిప్పో లేదా కదలకుండా అలాగే పెట్టో.  ఈ సెల్ఫీ ఫోటోలను ఫేసుబుక్కు, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కుల ద్వారా పంచుకుంటూ,  ప్రశంసలనందుకుంటూ స్నేహాలను పెంచుకోవడమే సెల్ఫీ తో కుల్ఫీ.  సెల్ఫీ అంటే పేరుకి తనఫొటో యే అయినా, చేతిని దూ..రంగా చాచి లెన్స్ ముందుకి..ఎంతమందినైనా నిలబెట్టి ఫోటో తీసుకున్నా కూడా ఆ కుల్ఫీ ని సెల్ఫీ యే అనొచ్చు.
ఈ కుల్ఫీ ఐడియా నిజానికి పాతకాలం నాటిదే.  ఒకప్పుడు రాజులు రాణులు తమ స్వీయ చిత్రాలను చిత్రకారునిచేత గీయించుకుండేవారు, లేదా తమచిత్రాన్ని తామే గీసుకుండేవారు. అందుకేగా వాళ్ళెలావుండేవారో మనకి తెలిసింది!!! ఆ తర్వాత నెగటివ్ లు కడిగి ప్రింట్లు వేసే ఫొటోలు,  డిజిటల్ కెమేరా ఫొటోలు వచ్చాయి.  ఇప్పుడీ స్మార్ట్ ఫోన్లు, ఫ్రంట్ కెమేరాల పుణ్యమా అంటూ యువత సెల్ఫీల మోజులో పడింది.
ప్రపంచంలో మొట్టమొదటి సెల్ఫీ 175 సంవత్సరాల క్రితమే తీశారు. అమెరికాలోని ఫిలడెల్సియాలో ఫోటోగ్రాఫర్ రాబర్ట్ కార్నెలియన్ 1839 సంవత్సరంలోనే తన సెల్ఫీ తీసుకున్నాడు. రాబర్ట్ కెమెరాను సెట్ చేసుకొని దాని ముందుకు వచ్చి 5నిమిషాల పాటు కదలకుండా నిలబడి ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో వెనుక ‘ఫస్ట్ లైట్ పిక్చర్ ఎవర్, 1839 అని కూడా రాసుకున్నాడు.
Ist selfie
నెగటివ్ తో కూడిన కెమేరాలు మూలన పడి చాన్నాళ్ళయ్యింది. ఇక డిజిటల్. నిజాయితీ గా చెప్పాలంటే డిజిటల్ కూడా ఎవరు వాడుతున్నారు? ఏదో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, ఫిల్మ్ మేకర్లు తప్ప.  సెల్ఫీ పిక్చర్లని తీసుకుని అలా పెట్టుకోవడంతో సరిపోదు, పూర్వం ఆల్బమ్ములలో అంటించి పెట్టినట్లు లేదా కంప్యూటర్లో ఒక ఫైల్ ఫోల్డర్ లో దాచినట్లు.  వాటిని ఫేస్ బుక్ లేదా ఇన్స్ టా గ్రాం లేదా ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ లకు జోడించాలి. అందుకే ఇది అంతర్జాల దృగ్విషయం (Internet phenomena).  ఏం.. ఆ సోషల్ వెబ్ సైట్ల పాలసీల ప్రకారం.. ఏ ప్రొఫైల్ పిక్చర్ గానో ఒక పిక్చర్ పెడితే చాలదా? పొద్దస్తమానం సెల్ఫీలెందుకు? ప్రొదున్న లేవగానే లేచానూ.. అనిచెప్పడానికి ఒక పిక్చరు, నిద్రపోతున్నానూ చెప్పడానికి మరో పిక్చరు ఇలా తాను చేస్తున్న ప్రతి పని ప్రపంచానికి ఎలుగెత్తి చాటడమే ఇంటర్నెట్ ఫినామినా, . దీనికి పూర్తి సహాయ సహకారాలందిస్తున్నది సెల్ఫీ.  దీనివల్ల లాభాలేమైనా ఉన్నాయా? ఎందుకు లేవూ?? ప్రపంచమంతా తన పైనే ధ్యాస ని పెంచుకుంటూ అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ ఉండాలనే నేటి తరం యొక్క మేటి కోరిక.  అంటే అదేదో ఇన్ సెక్యూరిటీ అనో, తన పై తనకు విశ్వాసం లేకపోవడమనో లేదా ప్రతిదానికి ఇతరులనుండి అంగీకారం కావాలనో కాదు గానీ, తాను ఎంత అద్భుతమైన మనిషో.. తాను చేసే ప్రతిపనిలో ఒక అద్భుతం ఎలా దాగివుందో ప్రపంచానికి చాటి అబ్బురపరచడం, అంతే.  ఇంకేమి లేదు. అదీ .. ఫేస్ లో !!!!!
మరి వాళ్ళు మన గురించే తప్పకుండా ఆలోచిస్తున్నారని (are you sure?) తెలిసేదెలా? ఆ పిక్చర్లు వెబ్ సైట్లలో పోస్ట్ చెయ్యగానే ఎంత ఫాస్ట్ గా మరియు ఎన్ని ఎక్కువ లైకులువస్తాయన్న దాన్ని బట్టి మన సెల్ఫీ యొక్క వేల్యూని అంచనా వేసుకోవచ్చు.  మళ్ళీ ఆ పోస్ట్ ను ఒక్క వెబ్ సైట్లో కాదు.. ఓపికానుసారం ఎన్ని వెబ్ సైట్లను మెయింటెయిన్ చేస్తే అన్ని వెబ్ సైట్లలోనూ పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
ఒకవేళ లైకులు, కామెంట్లు తక్కువైపోతున్న పక్ష్యం లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్త ఏవిటంటే.. సిట్యువేషన్ తో పాటు ముఖం లో ఎక్స్ ప్రెషన్ ని కూడా మారుస్తూ సెల్ఫీ లో బంధించడం.  లేకపొతే లైకులు తగ్గే ప్రమాదం వుంది.  ఈ ప్రమాదం రాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా నవ్వుతూ లేదా నవ్విస్తూ ముఖకవళికలు మారుస్తూ చూసుకోవాలి.  ఏదైనా విచిత్రవేషం వేసి సెల్ఫీ తీసుకుని తానెంత స్పెషలో చెప్పొచ్చు,  కనబడిన వారందరితో  శక్త్యానుసారం పిక్చర్లు తీసుకుని తాను ఎంత ప్యాపులరో చెప్పొచ్చు, ఏదో ఒక స్టుపిడ్ ఫేస్ పెట్టి తాను చాలా ఫన్నీ, హ్యాపీ అని నిరూపించుకోవ్వొచ్చు. ఆ తర్వాత కావాలంటే రెండు గంటలసేపు ఏడవ్వొచ్చు with own problems.
ఎవరైనా సెల్ఫీ పిక్చర్ పెట్టారంటే..వాళ్ళగురించి వాళ్ళు అందంగా ఉంటారనే చెప్పడానికి అని కాదు, అదే సెల్ఫీలతో వ్యంగ్య మైన ముఖ కవళికలను కూడా బంధించడం ఇప్పుడు ఒక ఫేషన్. ఎప్పుడూ నవ్వుతూ, నవ్వించే పిక్చర్లు ఇక బోర్ కొట్టిందంటే ట్రెండ్ మార్చాల్సిందేగా మరి! భయ భ్రాంతులతో కూడిన లేదా ఆకస్మిక ఆశ్చర్యం లేకా అనాకర్షణీయమైన పిక్చర్లు చెలామణిలో కి తెచ్చి మళ్ళీ లైకుల శాతాన్ని పెంచుకుంటారు. ఇలాంటి వ్యంగ్యాపూర్వకమైన చిత్రాలు గూగుల్ నిండా బొచ్చెడు. వీటి ప్రధమ కర్తవ్యం కేవలం ఏదో ఒక క్రొత్తదనంతో ఒక విచిత్రాన్ని సృషించి జనజీవన స్రవంతిలో ఒక కలకలాన్ని రేపాలనే చిన్న తృష్ణ తప్ప వేరేమీ కనబడదు. May be it’s a new form of socialism. క్రొత్తసామ్యవాద పద్దతి !!!
సెల్ఫీలతో యజమానులను చూసి చూసి వారి పెంపుడు జంతువులు కూడా సెల్ఫీలకు అలవాటు పడిపోతున్నాయి. వాటిని యానిమల్ సెల్ఫీస్ అంటున్నారు. యజమానులను అనుకరిస్తూ సెల్ఫీ పిక్చర్లు తీసుకుంటూ.. వాళ్ళు యానిమల్స్ అని మర్చిపోయి మనుష్యులే అనుకుంటున్నారేమో!
dog selfie
ఈ అద్భుత సాధనం వల్ల కూర్చున్న చోటనే సోషల్ నెట్ వర్కింగ్ పెరగుతున్నది. దానితో పాటుగా కొన్ని అవాంచనీయ మార్పులు కూడ మానవ జీవితం లో చోటు చేసుకునే అవకాశముందట. సెల్ఫీ పిక్చర్లను తీసుకోవడం ఎక్స్ చేంజ్ లు చేసుకోవడం వల్ల ఒక స్థాయిలొ శరీరాకర్షణ (narccism) లకు లోనవ్వడం, స్వీయశోషణ (self-absorption), అటెన్షన్ లకు ప్రాకులాడడం వంటి సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. వీటి ప్రభావం పెద్దలమీద కన్నా పిల్లలమీద ఎక్కువ చెడు ప్రభావాలని చూపిస్తున్నదిట. వారు మానసిక పరిణతిని పోగొట్టుకుని చిన్న వయసువల్ల సాంఘిక ఒత్తిడులను తట్టుకోలేకపోవడము, సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ ను పోగొట్టుకుని ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడడం లాంటి ప్రమాద పరిస్థితిలో పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.  ఏదైనా లిమిట్ లోవుంటేనే అందం కదా!!!!

మధుమేహం లేదా చక్కెర వ్యాధి (Insights of Diabetes)

మధుమేహం లేదా చక్కెర వ్యాధి (Insights of Diabetes)
Part-1
మధుమేహం లేదా చక్కెర వ్యాదిని వైద్య పరిభాషలో డయాబిటిస్ మెల్లీటస్ అంటారు. ఈ చక్కెర వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ గా,  ఒక మెటబాలిక్ డిసార్డర్ గా వివిధ టైపుల్లో మనిషికి సంక్రమించడమే కాకుండా ఒబీసిటీ (ఊబకాయం),  మానసిక ఒత్తిళ్ళు మరియు ఆందోళనలు,  ఆల్జీమియర్ లాంటి మెదడు సమస్యలలో కూడా సంబంధం కలిగివుంటూ వ్యాధులను మరింత సంక్లిష్టం చేస్తోంది.  క్లోమ గ్రంధి (Pancreas) లోని బీటా ( Islets of Langerhans) కణాలనుండి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోను హెచ్చు, తగ్గుల వల్ల అలాగే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ మెటబాలిజం ప్రక్రియలో లోపం వచ్చినపుడు తిన్న ఆహారం సరిగ్గా విచ్చిన్నం కాక రక్తంలో చక్కెర (గ్లూకోజ్) శాతం ఎక్కువ అయిపోవడం వల్ల మనిషికి మధుమేహం సంక్రమిస్తుంది.  మధుమేహం మూడు రకాలు..
  1. గెస్టేషనల్ డయాబిటిస్ (గర్భిణీ స్త్రీలలో వచ్చేది)
  2. టైప్ 1 డయాబిటిస్
  3. టైప్ 2 డయాబిటిస్
గెస్టేషనల్ డయాబిటిస్ గర్భధారణ సమయంలో వచ్చే చక్కెర వ్యాధి. ఈ సమయం లో శరీర కణాలు ఏవిధంగా గ్లూకోజ్ ని ఉపయోగించుకుంటుందో చెప్పడం కష్టం, కావున స్త్రీలు ఈ వ్యాధికి గురవుతారు. ఆ సమయంలో తగుజాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే అది గర్భంలోఉన్న శిశువుపై ప్రభావం చూపిస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకున్న మూలంగా ప్రసవం తర్వాత ఈ వ్యాధి పోతుంది.
టైప్ 1 డయాబిటిస్ ఒక ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్.  ఇది సాధారణం గా బీటా కణాలలో ఒక వంశపారంపర్యలోపంగా జనించి, ఏదైనా ఒక పర్యావరణ మూలకంగా ట్రిగ్గర్ అవుతుంది. దానితో బీటా కణాలు అపసవ్యంగా పనిచేయడం మొదలెడతాయి దాని పర్యవసానం గా ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడాలు కనిపిస్తాయి.  దానిమూలంగా ఇమ్యూన్ సిస్టం కూడా ట్రిగ్గర్ అవుతుంది.  బీటా కణాల చుట్టూ ఇమ్యూన్ కణాలు (ముఖ్యం గా తెల్ల రక్త కణాలు, వాటికి సంబంధించిన ఇతర ఉపకణాలు ఉదాహరణకి మాక్రోఫేజెస్) చుట్టుముట్టి.. వాటిని నాశనం చెయ్యడం మొదలెడతాయి. దానితో ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి పై ప్రభావం పడి గ్లూకోజ్ ని విచ్చిన్నం చేయడం కుంటుపడుతుంది. కాని ఇన్సులిన్ పూర్తిగా లోపించదు.
టైప్ 2 డయాబిటిస్ కూడా ఇన్సులిన్ లోపము లేదా ఇన్సులిన్ నిరోధము వల్లనే రక్తంలోని అధికమయిన గ్లూకోజు ని నివారించలేని ఒక అపసవ్యవ్యవస్థ. దీనికి టైప్ 1 డయాబిటిస్ వున్న తేడా ఏవిటంటే.. బీటా కణాల నాశనం వల్ల పూర్తి ఇన్సులిన్ లోపం వుంటుంది.
ఈ మధుమేహ లక్షణాలు మితిమీరిన దాహం, తరచూ మూత్ర విసర్జన మరియు నిరంతర ఆకలి. మధుమేహ వ్యాధుల్లో 90% టైప్ 2 ఉంటే కేవలం 10% మాత్రమే టైప్ 1 మరియు గెస్టేషనల్ రకాలు పేర్కొనబడ్డాయి.
 ఒబీసిటీ
జన్యుపరమైన స్థూలకాయం  (ఒబీసిటీ) ప్రాధమికంగా టైప్ 2 డయాబిటిస్ కు కారణమవుతుంది.  ఒబీసిటీ వున్నవాళ్ళు చాలా లావుగా వుంటారు, వాళ్ళకి స్థూలకాయం ఎక్స్ ట్రా మజిల్ వల్ల రావచ్చు, బోన్ వల్ల రావచ్చు, వళ్ళు నీరు పట్టేయడం వల్ల రావచ్చు లేదా క్రొవ్వు వల్ల రావచ్చు. కానీ వైద్య పరిభాష లో క్రొవ్వు బాగా పెరిగిపోవడం వల్ల ఒబీసిటి వస్తుందని చెప్తారు.
ఒబీసిటీ తో బాధపడుచున్న వాళ్ళలో ఇన్సులిన్ నిరోదించబడుతుంది. క్రొవ్వు కణాల్లో ఇమ్యూన్ కణాలయినటువంటి మేక్రోఫేజెస్ అధిక సంఖ్యలో పేరుకుపోతాయి, అక్కడి అనారోగ్యాన్ని గ్రహించి.  దానితో ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువయినప్పుడు వాపులు, కీళ్ళ నొప్పులు, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం జరుగుతాయి. అధిక గ్లూకోజ్ ని విచ్చిన్నం చెయ్యడానికి క్లోమ గ్రంధి నుండి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా క్లోమగ్రంధి ఐలెట్-బీటా కణాలు కూడా బాగా పెద్దవి గా పెరిగిపోతాయి, ఇది ఒక పేథోలాజికల్ కండిషన్. ఈ కండిషన్ లో ఇ న్సులిన్ అధికం గా విడుదల అవుతుంది. ఒక ప్రక్క గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ అవ్వడం, మరో ప్రక్క ఇన్సులిన్ కూడా అధికంగా ఉత్పత్తి అవ్వడం కూడా శరీరానికి మంచిది కాదు. ఇది ఇలా జరుగుతూ జరుగుతూ ఒక స్టేజ్ లో బీటా కణాలు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడం పూర్తిగా మానేస్తుంది. కణాలు కూడా సైజ్ లో చిన్నవి అయిపోతాయి, తరువాత చచ్చిపోతాయి కూడా.  అప్పుడిక ఇన్సులిన్ ఉండనే ఉండదు. ఇదే టైప్ 2 డయాబిటిస్ కి “కీ” ఫీచరు.  అప్పుడు  ప్రతిరోజూ భోజనానికి ముందు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవలసి వస్తుంది.  పూర్తిగా ఇన్సులిన్ ని కోల్పోయి టైప్ 2 డయాబిటిస్ గా రూపాంతరం చెందే లోపు తగు జాగ్రత్తలు తీసుకుంటే టైప్ 2 ని నివారించవచ్చు.
Diabetes
ఒబీసిటీ వల్ల టైప్ 2 డయాబిటిస్ వస్తుందంటే మరి దాని కారకాలని తగ్గిస్తే టైప్ 2 డయాబిటిస్ ని రివెర్సు చేయవచ్చా అని ఎలుకల మీద పరిశోధనలు చేసి కొన్ని ముఖ్యాంశాలని కనుక్కున్నారు. నార్మల్ ఎలుకలను ఒబీస్ గా మార్చిన తర్వాత ఇన్సులిన్ లోని వైవిద్యాలు, ఐలెట్ కణాలు సరిగ్గా పనిచెయ్యకపోవడం, వాపులు మరియు గ్లూకొజ్ లెవెల్స్ పెరగడం డిటెక్ట్ చేసారు. ఈ లక్షణాలన్నీ ఎలుకలు ఒకసారి డియాబిటిక్ కండిషన్ లోకి మారాక కూడా ఉంటాయి. మరి ఒబీసిటీ నుండి డియాబిటిసు కు ఎందుకు మారుతుంది అని ఖచ్చితంగా చెప్పగలగాలంటే.. ఒకసారి డయాబిటిక్ కండిషన్ లోకి మారాక.. ఆ కండిషన్ ని స్ట్రిక్ట్ గా మెయింటెయిన్ చెయ్యాలంటే.. ఆ ఎలుకలకున్న ఒబీస్ లక్షణమైన అధిక క్రొవ్వు పేరుకోవడాన్ని నిరోధించాలి. అందుకు కారణ భూతమైన “లెప్టిన్” అనే హార్మోనల్ రిసెప్టార్ ని పరివర్తన చేశారు, దానితో క్రొవ్వుని పేర్చే లక్షణాన్ని కోల్పోయి.. కేవలం డయాబిటిక్ గా మాత్రమే ఆ ఎలుకలు మిగిలాయి. ఈ కండిషన్ లోకూడా పైన చెప్పిన లక్షణాలు ఉన్నాయి పైగా వాపులకు కారణాలయిన ఇమ్యూన్ కణాలు అధికం గా బీటా కణాలని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల బీటా కణాలు నాశనమయి ఇన్సులిన్ పూర్తిగా లోపించింది మరియు బీటా కణాలు కూడా రాను రాను తగ్గిపోయి జీవం కోల్పోయాయి. దీనిని బట్టి అర్ధమయినదేమిటంటే ఒబీసిటి ఉంటే టైప్ 2 డయబిటిస్ కి దారి తీయడం సహజమే. ఒకవేళ ఒబీసిటీ లేకపోయినా కూడా టైప్ 2 డయాబిటిస్, ఇన్సులిన్ వైవిధ్యాలు, ఇమ్యూన్ కణాల వల్ల ఐలెట్ కణాల నాశనం మూలాన తప్పక సంక్రమిస్తుంది అని తెలుసుకున్నారు.  ఈ టైపు ఇన్సులిన్ లాస్ (Insulin loss) ని అరికట్టాలంటే ఇమ్యూన్ కణాలని, వాటి రెస్పాన్సస్ ని అరికట్టాలి, అందుచేత ఇమ్యూన్ బేస్డు థెరపీస్ (Immune based therapies) ని అభివృద్ది చేసి ఐలెట్ కణాల నాశనాన్ని ఆపితే ఈ రకపు టైప్ 2 డయాబిటిస్ ని అరికట్టవచ్చని పరిశోధకులు తెలియపరిచారు. ఈ థెరపీస్ గురించి తరువాయి భాగాల్లో తెలుసుకుందాం….
ఈ పరిశోధనా వివరాలను Cucak H et al (2014) J Leukocyte Biology Vol 95: Page 149 మరియు పైన చూపబడిన చిత్రం http://www.jdrf.ca/our-research/cure/ నుండి తీసుకొనబడినది.

ప్రతివారం గుడికెళ్తాను, కొబ్బరికాయ కొడతాను.. అయినా ఏ దేవుడూ దయ తలచడు, మరి గురువు మాత్రం ఏమి చేస్తున్నాడని?



మనిషికి, దేవునికి మధ్య వారధి గురువు. తన భారాన్ని తానే మోసుకుంటూ ఒకసారి వారధి వరకూ జాగ్రత్తగా వచ్చేస్తే అక్కడినుండి ఆ భారాన్ని గురువు మీద వేసేయవచ్చు. అప్పటికి గానీ గురువు కి మనమెవరమో తెలియదు అని “కాదు”. అలాగే తాను ఎన్ని అష్ట కష్టాలు పడుతూ, కోరుకున్న కోరికలు తీరక, అనుకున్నంత డబ్బురాక, కొందరిలా అన్నీ నాకెందుకు దొరకడం లేదు.. ప్రతివారం గుడికెళ్తాను, కొబ్బరికాయ కొడతాను.. అయినా ఏ దేవుడూ దయ తలచడు, మరి గురువు మాత్రం ఏమి చేస్తున్నాడని? ఎప్పుడూ ఆందోళనే ఎప్పుడూ అసంతృప్తే… ఇలా మానవుని ఆలోచనలు పరిపరి విధాల పరిగెడుతూనే వుంటుంది. నిలబడి తన అలోచ నా సరళి సరళంగా గానీ లేదా న్యాయసమ్మతం గా గానీ లేదా చట్టబద్దం గా గానీ వుందా అని ఎప్పుడైనా ప్రశ్నలు వేసుకుంటే సమాధానాలు దొరక్కపోవు కదా?
బాబాగారికి భక్తులవ్వడానికి ముందు వారు ప్రత్యేక తరహాలో వివిధ అనుభవాలకు లోనవుతారు. విచిత్రం ఏమిటంటే కొంతమందిని బాబాయే వెతుక్కుని వెళతారు, పరిచయమూ చేసుకుంటారు. అది వారి పూర్వ జన్మ సుకృతం అనుకుంటా…..మరికొంతమంది విషయం లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళయందు బాధ్యత పడుతూ, వారికి తోడ్పడడానికి మరోక భక్తుని సహాయం తీసుకుంటారు. కానీ, అవసరానికి బాబా సహాయం పొందుతున్న వ్యక్తికి మాత్రం తెలియదు తాను ఎవరివల్ల సుఖపడుతున్నాడో. బాబాగారిని ఇంకా గుర్తించలేకపోవడము, బాబాకు దగ్గిర కాలేకపోవడము ఆ వ్యక్తి యొక్క దురదృష్ఠము, వెంటాడుతున్న ఖర్మము. మరి కొంతమంది విషయములో పరీక్షలు. ఆ పరీక్షల మూలం గా పాఠం నేర్చుకోవడం, బాబాను గుర్తించడము- అంటే అప్పటికి వారి ఖర్మము అలా నివృత్తి అయ్యి ఉంటుంది, బాబాని గుర్తించడం జరిగివుంటుంది. మరికొంత మంది బాబా యందు మూర్ఖత్వాన్ని చూపి.. పూర్తిగా నమ్మక… బాబాకు పరీక్షలు పెట్టి (భౌతికంగా లేకపోయినా) అంటే బాబా దగ్గిర చేసుకోవాలని చూస్తుంటారు.. వీళ్ళు మూర్ఖత్వంతో ఎడ్డె మంటే తెడ్డం అని మా అంతటివారు లేరు, అంతా మేమే అని పారిపోతుంటారు. అప్పుడది బాబా గారికి కష్టమిచ్చినట్లే. గురువుకి కూడా పరీక్షలే! ఆ మూర్ఖత్వం కూడా శాపకర్మమే. గురువు ఆ మూర్ఖత్వం మీద వర్క్ అవుట్ చేస్తే గాని ఆ సదరు వ్యక్తికి శాపవిమోచనమూ కాదు, గురువుకు దగ్గరనూ కాడు.
సోమదేవస్వామి అనే వ్యక్తి బాబాగారి మీద అనుమానపు దృష్ఠి తో (అంటే ఆయన నిజం గా యోగి యేనా అనేటటువంటి మీమాంస) షిర్డీ వచ్చాడుట . అతను షిరిడీ రాగానే ఇంకా బాబాను కలవడానికి ముందరే అంటే శిష్య వర్గాన్ని కలసిన తోడనే అతని మొదటి అనుభూతి- మన:శ్శాంతి, మానసిక ఉల్లాసము. ఇది బాబా గారి లక్షణము, ఆయన్ని నిరంతరం కొలిచేవారికి కూడా అదే లక్షణాన్ని బాబా ప్రసాదిస్తారు. అందుకే సోమదేవస్వామి కి అట్టి అనుభూతి. అనుమానం తో వచ్చిన వ్యక్తికి ఎన్నడూ అనుభూతి చెందని శాంతి, నిశ్చలత, ఉల్లాసము ఏల కలిగెను? అంటే ఆపాటివరకూ ఆయనకున్న కర్మం తొలగింది, తనను తాను గుర్తించడం మొదలు పెట్టాడు. క్రొత్తగా తనని తాను గుర్తించడం అనేది జరగడమే గురువు సంకల్పం. ఆ సంకల్పమే సోమదేవస్వామిని షిరిడీ రప్పించింది, అతని జీవితాన్ని మార్చింది.
ఈ లోపున సోమదేవస్వామికి తన మొదటి గురువు చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి- “ఎచ్చట మనసు శాంతించి ఆనందం పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము” అని. బాబాయందు తన మూర్ఖపు ఆలోచనలు వీడి వెంటనే సోమదేవస్వామి బాబాను తప్పక కలసి వెళ్ళాలనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మూర్ఖత్వం నుండి జ్ఞానోదయం కలగడం అంటే ఇదేనెమో? దీనికా దైవసంకల్పమూ, గురు బలమూ రెండూ లేకపోతే జరగనే జరగదు. తనను తాను తెలుసుకోకుండా, తన చుట్టు ప్రక్కల పరిస్థితులను అర్ధంచేసుకోకుండా, అర్ధం లేకుండా బ్రతికేయడం కూడా ఒక శాపం!