గౌతమి

గౌతమి

Wednesday, April 1, 2015

నికోటిన్ కొన్ని ఆరోగ్య సమస్యలకి విరుగుడయినప్పటికీ.. దాన్ని పీల్చాక కొన్ని ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. ఎలా?సైన్స్ కబుర్లు అనే మా అంతర్జాల రేడియో "తెలుగు తరంగా"  (telugu.tharangamedia.com) షో లో మేము ప్రస్తావించిన సైన్స్ విషయం. 

నికోటిన్ అనేది పొగాకు లోవుండే ఒక పదార్ధం.  సాధారణం గా పొగ త్రాగే మగవాళ్ళు పనివత్తిడి లో ఉన్నప్పుడు అబ్బా..అలా ఒక్క సిగరెట్టు తాగి వద్దాం, కొంచెం బుర్ర పనిచేస్తుంది..మళ్ళీ మరి కొంచెం పని చేసుకోవచ్చు అనుకుంటారు. అంటే వాళ్ళ ఫీలింగ్ నిజమా? నిజమేనేమో?? ఎందుకంటారు?

బ్రెయిన్ లో Acetyl choline receptors వుంటాయి. ముఖ్యం గా నికోటినిక్ ఎసిటైల్కొలీన్ రిసెప్టర్ బ్రెయిన్ లో జ్ఞాపకశక్తికి, లెర్నింగ్ కి, అటెన్షన్ కి సంబంధించినది. ఈ రిసెప్టర్ గనుక సరిగ్గా పనిచెయ్యకపోతే రిసెప్షన్ అనేది పూర్ గావుంటుంది. పార్కిన్ సన్, ఆల్జీమర్, షైజోఫ్రినియా వ్యాధులతోధపడేవాళ్ళకీ ఈ రిసెప్టర్ పనిచెయ్యదు. ట్విస్ట్ ఏవిటంటే వీటిని ట్రీట్ చెయ్యడానికి, నికోటిన్ ని ఇంజెక్ట్ చేస్తారు. అది ఈ నికోటిన్ రిసెప్టర్ ని బైండ్ అయ్యి దాన్ని స్టిములేట్ చేస్తుంది. అందుకే ఈ నికోటిన్ ని తెరాప్యూటిక్ ఏజెంట్ గా వాడుతారు. అసలు ఈ రిసెప్టర్కి నికోటినిక్ రిసెప్టర్ అని పేరు రావడానికి కారణం ఇదే. విషానికి విషమే విరుగుడు అంటే ఇదేనెమో. ఏది ఏమైనా నికోటిన్ కి బ్రెయిన్ రెసెప్టర్ని stimulate చేసే గుణముంది. అందుకే గాబోలు.. ఏ ఆరోగ్య ప్రోబ్లమూ లేని వాళ్ళు మెదడు చురుకుదనం తగ్గినప్పుడు సిగరెట్టు త్రాగాలనుకుంటారు.

శరీరంలో ఉత్పత్తి అయ్యే మోనో ఎమైనో ఆక్సిడేజ్ ఎంజైము ప్రతి కణంలో మైటోకాండ్రియా లో తయారు అవుతుంది. ఇది  న్యూరో ట్రాన్స్మిట్టర్స్ మీద పనిచేసి వాటిని బ్లాక్చేస్తుంది.  అలా బ్లాక్ చెయ్యకుండా ఆ enzyme ను ఆపడానికి  ఆపడానికి కొన్ని ఇన్ హిబిటర్ ప్రోటీనులు పనిచేస్తాయి.  అవి పని చెయ్యడం మానేసినప్పుడు, ఈ ఎన్ జైము ట్రాన్స్మిట్టర్స్ మీద పనిచేసేసి, మనుష్యులకు  డిప్రస్షన్ ని కలిగిస్తాయి లేదా మెదడు యొక్క చురుకుదనాన్ని తగ్గించేస్తాయి. అప్పుడు నికోటిన్ ని గనుక మెడిసినల్ ట్రీట్మెంట్ గా తీసుకుంటే ఆ డిప్రషన్లోంచి బయటపడే అవకాశం వుందట.  అయితే దీనిపైన పరిశోధనలపరంగా ఇంకా కొనసాగుతూనేవున్నాయి.. ఈ నికోటిన్ బ్లాక్ అయిన రిసెప్టర్ ని స్టిములేట్ చేస్తున్నదా? లేక మోనో ఎమైనో ఆక్సిడేజ్ ని modulate చేస్తున్నదా? అని. ఇంకా సమాధానం దొరకలేదు.

నికోటిన్ కొన్ని ఆరోగ్య సమస్యలకి విరుగుడయినప్పటికీ.. దాన్ని పీల్చాక కొన్ని ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. 

ఈ పొగాకు పీల్చడం హానికరం అని ప్రతిచోట బోర్డులు పెడుతుంటారు. ముఖ్యంగా అది ఊపితిత్తులకు, నోటికి క్యాన్సర్ ని తీసుకువస్తాయని చెబుతూవుండడం వల్ల.. ప్రజలకి కూడా అవిమాత్రమే కారణాలుగా కనబడుతుంటాయి. అంతకన్నా ముఖ్యంగా డయాబిటిస్ వున్నవాళ్ళకి ఇంకా ప్రమాదం. డయాబిటిస్ తో బాధపడేవాళ్ళలో ఈ నికోటిన్ గుండెపోట్లని, నరాలు అలాగే మూత్రపిండాల వ్యాధుల్ని ఎక్కువ చేసి, మనుష్యుల్ని ఇంకా త్వరగా చంపేస్తుంది. అందువల్ల నికోటిన్ ఒక విషపదార్ధం అని చెప్పుకోవచ్చు. ఇది రక్తం లో కలిసాక హీమోగ్లోబిన్ A1c లెవెల్స్ ని ఎక్కువచేసుంది. అసలు HbA1c ఏవిటి?

Hb1Ac ని glycated hemoglobin అని అంటారు. ఆక్సిజన్ ని వివిధభాగాలకి మోసుకుపోయే హీమోగ్లోబిన్ గ్లూకోజ్ తో బైండ్ అయ్యి glycated form గా మారుతుంది. దీన్ని percentage లెవెల్లో measure చేసి గ్లూకోజ్ లెవెల్స్ ని తెలుసుకుంటారు బ్లడ్ టెస్ట్ ద్వారా.  ఇది ఎందుకు చేస్తారంటే ఎర్రరక్తకణాలకు గ్లూకోజ్ మాలుక్యూల్సు అటాచ్ అయి ప్రవాహంలో అన్నిభాగాలకు సరఫరా అవుతాయి. శరీరంలో గ్లూకోజ్ గనుక ఎక్కువ అయితే ఆ కణాలకి గ్లూకోజ్ మాలుక్యూల్స్ కూడా ఎక్కువగా అటాచ్ అవుతాయి. A1c లెవెల్స్ కూడా పెరుగుతాయి. దాని పెరుగుదలను టెస్ట్ చేసి సాధారణంగా డయాబిటిస్ ని డయాగ్నోస్ చేస్తారు. ఇప్పుడు డయాబిటిస్ తో బాధపడుతున్న స్మోకర్స్ లో దీని పెరుగుదల ఇంకా ఎక్కువుంటుంది. అంటే నికోటిన్ రక్తం లో గ్లూకోజ్ ని ఎక్కువచేస్తుందన్నమాట. ఇది పబ్లిక్ కి తెలియవలసిన ముఖ్యమైన విషయం.

నికోటిన్ బ్లడ్ లో గ్లూకోజ్ ని పెంచుతుందా?
Yes….లిపోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా….

లిపోలైసిస్ అంటే hydrolysis of tryglycerides.  Tryglycerides, water తో రియాక్ట్ అయ్యి విచ్చిన్నమవ్వడం. విచ్చిన్నమయ్యి free fatty acids గా, glycerol గా విడిపోవడం. ఈ రెండూ మళ్ళీ blood stream లో నే కలుస్తాయి.  Fatty acids ని అన్నికణాలు తీసుకుంటాయి. Glycerol ని liver మరియు kidney తీసుకుని glycerol kinase enzyme ద్వారా glycerolaldehyde-3 phosphate గా మారుతుంది. ఈ glycerolaldehyde- 3- phosphate gluconeogenesis and glycolysis అనే జీవక్రియలను join చేస్తుంది.  Glucogenesis అంటే glucose ని generate చెయ్యడం, glycolysis అంటే generate అయిన glucose ని break down చేసి ATP లేదా energy source గా మార్చడం.  ఇదంతా కూడా లిపోలైసిస్ లేదా triglyceride hydrolysis కరెక్ట్ గా తగిన మోతాదు లో జరిగితే.. final గా గ్లూకోజ్ generation, దాని break down కూడా కరెక్ట్ గా జరుగుతుంది. నికోటిన్ ఈ triglyceride hydrolysis ని enhance చేసేస్తుంది.  అప్పుడు glucose generation కూడా అధికం గా జరుగుతుంది..  దాన్ని control చెయ్యాడానికి ఇన్సులిన్ కావాలి కదా..మరి ఆల్ రెడీ ఈ డయాబిటిస్ తో బాధ పడుతున్న వాళ్ళలో ఇన్సులిన్ పనిచెయ్యదు కాబట్టి glucose levels, blood లో పెరుగుతూ పోతుంది.  ఉన్న డయాబిటిస్ వల్లే కాకుండా, నికోటిన్ పుణ్యమా అంటూ blood లో glucose levels ఇంకా పెరుగుతాయి.  

డయాబిటిక్ పేషంట్లలో insulin resistance ఉంటుంది అంటే వాళ్ళలో insulin signaling వుండదు. Insulin signaling లో STAT-3 అనే ప్రొటీను, సిగ్నలింగ్ ట్రాన్స్ డ్యూసర్ లా ఉపయోగపడుతుంది. ఈ నికోటిన్ అసిటైల్ కొలీను ఈ ప్రొటీనును stimulate చేస్తుంది.  ఇటీవల ఎలుకల మీద పరిశోధనలు చేసి ఒక ముఖ్యమైన విషయాన్ని పరిశోధకులు వెల్లడిచేశారు. నికోటిన్ ని brain లోకి inject చేసి.. ఆ రిసెప్టర్ ని స్టిములేట్ చేసి, STAT-3 ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ ని పెంచారు. వాళ్ళ రిజల్ట్స్ క్రొత్త మలుపును తీసుకువచ్చాయి.

1. స్టాట్-3 అనేది నికోటిన్ రిసెప్టర్ వల్ల స్టిములేట్ అవుతుంది.
2. ఏ కారణం చేతనైనా నికోటిన్ రిసెప్టర్ పనిచెయ్యకపోతే స్టట్-3 పనిచెయ్యదు, ఇన్సులిన్ సిగ్నలింగ్ దెబ్బతింటుంది, అప్పుడు అది డయాబిటిస్ కి దారితీస్తుంది.
3. ఇటువంటి నేపధ్యంలో నికోటిన్ తో రిసెప్టర్ ని treat చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచారు.
4. అంతే కాకుండా ఎలుకల యొక్క బరువు తగ్గిందిట మరియు ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గాయిట.

Reference: Xu T_Y, Guo L-L, Wang P, Song J,  et al (2012) Chronic exposure to nicotine enhances insulin sensitivity through alpha 7 nicotinic acetylcholine receptor-STAT3 pathway. PLoS One 7:e51217

అందుకే గాబోలు డయాబిటిక్ పేషంట్లలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు, పేషంట్లు మెంటల్ గా డిస్ ఓరియంట్ అవ్వడం, తర్వాత కోమాలోకి కూడా దిగిపోవడము జరిగిపోతూవుంటుంది. అంటే దానికి కారణం న్యూరో ట్రాన్స్మిట్టర్స్ కంప్లీట్ గా బ్లాక్ అవ్వడం, ఇన్సులిన్ కూడా కంప్లీట్ గా పనిచెయ్యకపోవడము.

నికోటిన్ వల్ల మూత్రపిండాల వ్యాధి వస్తుందా?
దానివల్ల రాకపోయినా, ఆల్ రెడీ ఏదైనా ప్రాబ్లంవున్నప్పుడు అది ఈ నికోటిన్ వల్ల ఎక్కువ అయిపోయే ప్రమాదం వుందట. కిడ్నీస్ లో మీసెంజీల్ సెల్ల్స్ అనే ప్రత్యేక తరహా సెల్ల్స్ .. బ్లడ్ వెసెల్స్ చుట్టూవుంటాయి. అలాగే వాటి సర్ఫేస్ మీద నికోటిన్ రిసెప్టర్లు కూడావుంటాయి. ఈ స్మోకర్స్లో ఆల్ రెడీ కిడ్నీ వ్యాధితో ఉన్నవాళ్ళకి, నికోటిన్ ఆ రిసెప్టర్స్ కి బైండ్ అయ్యి మీసెంజీల్ సెల్స్ ని బాగా యాక్టివేట్ చేసేసి రేపిడ్ గా వాటి సంఖ్యను పెంచుతాయట.. క్యాన్సర్ ఎఫెక్ట్. దీనివల్ల కిడ్నీ సెల్స్ లో ఎటువంటి ప్రాబ్లం వున్న కూడా నికోటిన్ వాటిని యాక్టివేట్ చేసేసి ప్రొలిఫెరేట్ చేసేయడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా ప్రబలం అయిపోతుంది.

పొగాకు దాని నికోటిన్ శరీరంలోకి వెళ్ళాక వున్న ఆరోగ్యసమస్యలను ఎక్కువచేస్తాయి. అలాగే మరి నికోటిన్ ని మెడిసినల్ గా కొన్ని బ్రెయిన్ వ్యాధుల్ని ట్రీట్ చెయ్యడానికి వాడుతున్నప్పుడు, పొగ త్రాగుట ఆరోగ్యానికి మంచిది కాదని ఎందుకంటారు? పొగ త్రాగే వ్యక్తిని కెళ్ళు కెళ్ళు మని దగ్గితున్నట్లు, అతని ఊపిరితితులు పొగబారి నల్లగా అయిపోయినట్లు ఎందుకు చూపిస్తారు?
ఈ సిగరెట్ల తయారీలో దగ్గిర దగ్గిర 400 కెమికల్స్ ని వుపయోగిస్తున్నారు. సిగరెట్లు కాలి స్మోక్ గా release అయినప్పుడు అవి మరో 4000 కెమికల్స్ గా రూపాంతరం చెంది, పీలుస్తున్నాము కాబట్టి ఊపిరితిత్తుల ద్వారా శరీరభాగాలకి వ్యాప్తి చెంది, రకరకాల క్యాన్సర్లను కలుగజేస్తున్నది. సిగరెట్టు స్మోక్ ఉత్పత్తి చేసే కొన్ని కెమికల్స్ చెప్తాను చూడండి.


1. ఎసిటోను- నైల్ పాలిష్ రిమూవర్ లో ఉండేది.
2. ఎసిటిచ్ యాసిడ్- హెయిర్ డై లోవుండేది
3. అమ్మోనియా- క్లీనింగ్ డిటర్జెంట్స్ లోవుండేది
4. ఆర్సెనిక్- ఎలకల మందులోవుంటుంది
5. బెంజీను- రబ్బరు సిమెంటులోవుంటుంది
6. బ్యూటేను- లైటర్ ఫ్లుయిడ్లోవుంటుంది.
7. కాడ్మియం- బ్యాట్టర్య్ యాసిడ్లో వుంటుంది
8. కార్బన్ మోనాక్సైడ్- వాహనాలనుండి వచ్చే ఎగ్జాస్ట్ ఫ్యూములు
9. ఫార్మాల్డిహైడ్-
10.హెగ్జామైన్- బార్బిక్యూ లైటర్ ఫ్లూయిడ్లొ వుండే ది.
11.లెడ్ - బ్యాటరీస్ లో వుండేది.
12.నాఫ్తలీన్-
13.మిథనాల్- రాకెట్ ఫ్యూయిల్ లో వుండేది
14.నికోటిన్- దీన్ని ఇన్ సెక్టిసైడ్ గా కూడా ఉప్యోగిస్తారు.
15.టార్- రోడ్లు వేస్తారు
16.టౌలీన్- పెయింట్లలొ ఉపయోగిస్తారు.

ఈ కెమికల్స్ అన్ని ఊపితిత్తులని, ఇతరభాగాలని డామేజ్ చేసి, వాటిని నల్లాగా మార్చి, క్యాన్సర్ జబ్బులని కూడా తీసుకువస్తాయి.  కాబట్టి smoking is injurious to health!


No comments:

Post a Comment