గౌతమి

గౌతమి

Sunday, April 5, 2015

"ఫ్లూ" రానీ, భరిద్దాం..నేచురల్ గా ఇమ్యూనిటీ ని సాధిద్దాం..వాక్సిన్లు వద్దు!! ...అనడం ఎంతవరకు సమంజసము ?????

స్వైన్ ఫ్లూ

సైన్స్ కబుర్లు అని మేము ప్రతి నెలా రెండుసార్లు నిర్వహించే అంతర్జాల రేడియో షో (March7th, 2015)(Internet radio, http://telugu.tharangamedia.com/) లో స్వైన్ ఫ్లూ వాక్సినేషన్స్ గురించి, అసలు ఇన్ ఫ్లూయింజా యొక్క రూపాంతరాలగురించి కూలంకషం గా చర్చించాము.  ఆ షో, మిస్ అయిన వారికి.. ఈ బ్లాగు లోని వివరణ. ఇంతకు మునుపు ఎబోలా వైరస్ మీద మా షో లో ఫోకస్ చేసాం. ఇవాళ స్వైన్ ఫ్లూ వైరస్ మీద ఫోకస్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఫ్లూ ఇండియా, మెక్సికో, యూరప్ అలాగే అమెరికాదేశాలను ఒక ఊపు ఊపుతున్నది. ఇండియాకి వైరస్సు ఇతర దేశాలనుండి వ్యాపిచెందింది. ప్రస్తుతం ఇది మహమ్మారిలా కలకలం రేపుతోంది. స్వైన్ ఫ్లూ వైరస్ ని నిరోధించడానికి వాడే వాక్సిన్, వ్యాధిని ఆపడం మనేది చెయ్యకపోవడమే కాకుండా క్రొత్తగా న్యూరోలాజికల్ డిసార్డర్ కి కారణమవుతున్నదిట. ఇప్పుడు ఇదీ మెడికల్ ఫీల్డ్ కి చాలెంజింగ్ గా తయారయ్యింది. ఇదీ, నిన్ననో మొన్ననొ బయటకొచ్చిన వైరస్ కాదు ఇన్ ఫ్లూయింజా వైరస్సు, దీనికి వాక్సిన్ కూడా కనిపెట్టారు, వాడారు, లాభం కూడా పొందారు. మరి ఈ లేటెస్ట్ వాక్సిన్స్ ఎందుకు పనిచెయ్యడం లేదు సరికదా క్రొత్త జబ్బులకు ఎలా నాంది పలుకుతున్నదీ అన్న విషయాన్ని చర్చిద్దాం.
అసలీ ఫ్లూ అనేదే చరిత్రలో చాలా పాతది. ఎంత పాతదంటే 1918 నాటిది. 1918 లో మొట్టమొదట వచ్చిన ఫ్లూ ని స్పానిష్ ఫ్లూ అన్నారు. ఎందుకంటే ఇది మెక్సికో లో ఉద్భవిచింది. అది ప్రొద్దుట సోకితే రాత్రికల్లా మనిషి చనిపోయేవాడట. కేవలం ఈ వైరసే కాకుండా ఆ చావులకు న్యూమోనియా లాంటి బాక్టీరియా తోడయ్యివుండేదిట. అంటే ఆల్ రెడీ బాక్టీరియల్ ఇన్ ఫెక్ష్న్లతో బాధపడుతూ, వ్యాధినిరోధకశక్తి తక్కువగా వున్నవాళ్ళలో ఈ వైరస్ సులువుగా సోకి, చావుకు చాలా దగ్గిరగా తీసుకువెళ్ళిపోయేదన్నమాట. ఈ రెండూ కలిసి, మహమ్మారిలాగ ప్రపంచాన్నే గడగడ లాడించింది. ఆరోజుల్లో ఫ్రెష్ గాలి వచ్చే ప్రదేశాలలో వుండడం, హెల్తీ లిక్విడ్స్ తీసుకోవడం తప్ప వేరే చేయగలిగిందిలేదు. 20 నుండి 50 సంవత్సరాల వయసు లోపు వారిని, సోకేది. దాదాపు 20% నుండి 40% ప్రపంచ జనాభా జబ్బు పడ్డారుట.

ఆ తర్వాత మళ్ళీ 1957 లో ఒక క్రొత్త ఫ్లూ వైరస్ దిగుమతి అయ్యింది. ఈ స్ట్రయిన్ ని కేవలం చాలా కొద్ది మంది మాత్రమే (అది కూడా 65 సంవత్సరాల లోపు వాళ్ళు) తట్టుకునే పరిస్థితిలో వుండేవారు.  హెల్త్ అఫీషియల్స్ ఈ మహమ్మారిని జాగ్రత్తగా ఫాలో అవుతూ.. వాక్సిన్ ని కనుక్కోవడానికి పునాది వేశారు. అది 1957 వ సంవత్సరం, మే నెలలో అనుకుంటా. ఆగస్ట్ కల్లా  వాక్సిన్ తయారయ్యినా కూడా.. చాలా లిమిటెడ్ సప్లైవుండేది.  ఇది మెల్లగా అమెరికా కి సోకింది. పిల్లల్ని, గర్భిణీ స్త్రీలని ఎక్కువగా ఇన్ ఫెక్ట్ అయ్యేదట. తగ్గినట్టు తగ్గి, మళ్ళీ 1958 లో మహమ్మారిలా విజృభించిదిట. సో... ఫ్లూ వైరస్ ఇన్ ఫ్లూయింజా + న్యూమోనియా బాక్టీరియా కి సంబంధించిన చావులు విపరీతమయ్యాయి... 1957 నుండి 1958 వరకు. 1918 లోని అంత ఎక్కువకాకపోయినా. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రం ఈ strain కు తట్టుకోలేకపోయారు. 

మళ్ళీ పదేళ్ళ తర్వాత 1968-1969 లో హాంగ్ కాంగ్ లో మరో క్రొత్త ఫ్లూ వైరస్ బయలుదేరింది. ఈ హాంగ్ కాంగ్ వైరస్ ఫ్లూ 1957 మహమ్మారి వైరస్ ను పోలి వుండడం వల్ల అప్పటికే చాలా మందిలో ఆల్ రెడీ వ్యాధినిరోధకతను కలిగివున్నారు. రెండవ విషయం... స్కూలు వెకేషన్ టైం లో ఇది విరుచుకు పడడం వల్ల కూడా వ్యాప్తి తగ్గింది, పిల్లలకి స్కూలు లేకపోవడం వల్ల. న్యూమోనియాని అరికట్టడానికి వైద్య వసతులు, యాంటీ బయాటిక్స్ ఎక్కువ అవడంతో కొంత వరకు మెరుగయ్యింది. అక్కడితో ఆగి, మళ్ళీ ఒక మైల్డ్ వైరస్ గా 1970-72 వరకూ కొనసాగింది. అలా మైల్డ్ ఫ్లూ వైరస్ గానే కొనసాగుతూ వచ్చింది మొన్నటిదాకా.

మళ్ళీ 40 యేళ్ళ తర్వాత 2009 లో ఒక విచిత్రమైన వెరస్ గా యునైటడ్ స్టేట్స్ లోనే అవధరించి, అక్కడినుండి ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెందడం మొదలయ్యింది. అదే స్వైన్ ఫ్లూ. ఇది మొదటిసారిగా ఏప్రిల్ 15, 2009 నాడు కనుక్కొన్నారు. దీనిని హెచ్1ఎన్1 వైరస్ అనికూడా అంటారు. అమెరికా గవర్నమెంట్ దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ గా డిక్లేర్ చేశారు, దీనికి మళ్ళీ కొత్తరకం వాక్సిన్ ని తయారుచెయ్యడానికి నడుం బిగించారు. జూన్ నెల కల్లా 18000 కేసులు అమెరికాలో నమోదయ్యాయి అమెరికాలోనే. అమెరికా కాక.... ఇంకా 74 దేశాలు ఈ వైరస్ తో ఎఫెక్ట్ అయ్యాయి. అయినా ఆ రేటులో వాక్సిన్ ని మాత్రం తయారు చెయ్యలేకపోయారు, కేవలం అత్యంత ప్రమాద స్థిత్లో వున్నవాళ్ళు మాత్రమే వాక్సిన్ ని పొందగలిగారు. ఒరిజినల్ గా హెచ్1ఎన్1 వైరస్ నే స్వైన్ ఫ్లూ అనేవారు. ఏదిఏమైనా వ్హో లాంటి ఆరోగ్య సంస్థలు హ్1ణ్1 వైరస్ కు గుడ్ బాయ్ చెప్పేసారు. 
                                                                                            
అయినా వైరస్ ఊర్కోలేదు మరో క్రొత్త రూపాన్ని దాల్చింది. అదే హెచ్5ఎన్1 వైరస్. దీనినే ఏవియన్ వైరస్ అనికూడా అంటారు. 1977లో హాంగ్ కాంగ్  లో ఉద్భవించింది. ఇది చికెన్ నుండి పిగ్, పిగ్ నుండి హ్యూమన్ కి సోకేది. కాని అది అప్పటివరకే ఆగిపోయింది గాని, అదే స్ట్రయిన్ మళ్ళీ మళ్ళీ విజృభించలేదు. కానీ 2003 కి వచ్చేసరికి ఏషియా, మిడిల్ ఈస్ట్ అంతా ప్రాకి.. పౌల్ట్రీ నంతా నాశనం చేసింది. ఈ వైరస్ సోకిన పౌల్ట్రీ కి దగ్గిరగా వున్న హ్యూమన్స్ ని, లేదా తినే హ్యూమన్స్ ని సోకడం మొదలుపెట్టింది. కానీ.. హ్యూమన్ నుండి హ్యూమన్ కి మాత్రము సోకలేదు.  ఈ విధమైన వైరస్ ఆఖరికి... ఏవియన్ + హ్యూమన్ వైరల్ స్ట్రయిన్ గా మ్యుటేట్ అయ్యింది. దీని హెరిడటరీ మెటీరియల్ లో హ్యూమన్ కి మరియు ఏవియన్ కి సంబంధించిన మెటీరియల్ వుంటుంది. 

చూశారా... ఈ ఫ్లూ వైరస్ లు కానిస్టంట్ గా mutate అవుతూ క్రొత్త క్రొత్త వైరస్సులు గా మార్పు దాల్చుతూనే వుంటుంది. ఇదేంటి మళ్ళీ ప్రతి సంవత్సరం ఫ్లూ వాక్సిన్ తీసుకునే వుంటున్నాము కదా... ఈ రకరకాల వైరస్సులేమిటీ? వీటికి క్రొత్త క్రొత్త వాక్సిన్స్ ఏమిటీ? మొన్నటివరకూ తీసుకున్న వాక్సిన్లు ఏవీ పనిచెయ్యవా? మరలాంటప్పుడు ప్రతి యేడూ... వాక్సిన్ ని ఎందుకు తీసుకోవాలి? దీనిని బట్టి చూస్తే మెడికల్ ఫీల్డు వాళ్ళు వాక్సిన్ అని అబద్దం చెబుతున్నారన్న మాట లేదా వాక్సిన్ అని చెప్పి వంట్లో కి ఏమి ఎక్కిస్తున్నారో ఏమో, దాని వల్ల శరీరానికి ఏ సమస్య వస్తుందో ఏమో అనే ఒక అసంపూర్ణమైన అభిప్రాయానికి వచ్చేసి... ఫ్లూ రానీ... దాన్ని భరిద్దాం, నేచురల్ గానే దానికి ఇమ్యూనిటీ ని సాధించుకుందాం అని... వాక్సిన్సు వేసుకోకపోవడం, వారి పిల్లలకి కూడా వేయించకపోవడం అనేది చేస్తున్నారు. దీనివల్ల... వేలాదిమంది పిల్లలు, పెద్దవాళ్ళు ఫ్లూ వైరస్సులు సోకి బాధపడుతున్నారు.. 

ఈ సమస్యని ఎలా అర్ధం చేసుకోవాలో కరెక్ట్ గా చెప్తాను. అప్పుడు వాక్సిన్స్ వేసుకోకపోవడం ఎంత తప్పో తెలుస్తుంది. ముఖ్యం గా ఇది చెప్పడానికే ఈ లేటెస్ట్ న్యూస్ ని ఎంచుకున్నాం. 

ఈ viral changes రెండు రకాలున్నాయి. యాంటీజెనిక్ డ్రిఫ్ట్ (antigenic drift) మరియు యాంటీజెనిక్ షిఫ్ట్ (antigenic shift). యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటే సహజంగా ఫ్లూ వైరస్ చాలా నెమ్మదిగా change అవుతూ వస్తుంది, చాలా కాలం పడుతుంది. ఈ లోపుల ప్రతి సంవత్సరం వాక్సిన్ వేసుకుంటే... వ్యాధినిరోధకత పెరిగి దాని లక్షణాలు మనలో క్షీణిస్తూ వస్తుంది, సో ఫ్లూ ఇక సోకదు.

అదే రెండవరకం యాంటీజెనిక్ షిఫ్ట్ అంటే రెండురకాల ఫ్లూ స్ట్రయిన్స్ ఒకే కణాన్ని ఇన్ ఫెక్ట్ చెయ్యడం. అటువంటి రెండురకాల strains బలంగా తయారయ్యి.. జంతువలని ఇన్ ఫెక్ట్ చేసి... వాటినుండి హ్యూమన్స్ కి సోకుతాయి.. ఇలాంటివే pandemic diseases గా విజృంభిస్తాయి.. వీటికి పైన చెప్పిన సీజనల్ ఫ్లూ వాక్సిన్లు ప్రతి యేడూ తీసుకుని తగ్గిపోవాలంటే ఎలా? అది వేరు, ఇది వేరు. కాబట్టి ప్రతి యేడూ మనకిచ్చే ఫ్లూ వాక్సిన్ రెండు, మూడు సీజనల్ వాక్సిన్లను కలిపి తయారుచెస్తారు కాబట్టి, సీజనల్ ఫ్లూస్ ని తప్పకుండా అరికడుతుంది. తప్పకుండా ఆ వాక్సిన్ ని తీసుకోవాలి. అయినా సరే వైరస్ సోకింది అంటే... మరో క్రొత్త రకమైన అంటే మ్యుటేటడ్ స్ట్రయిన్ అని తెలుసుకోవాలి. మామూలు ఫ్లూ వాక్సిన్ ని వేసుకున్నప్పటికీ కూడ కొంతవరకు క్రొత్త స్ట్రయిన్ యొక్క లక్షణాలని అదుపులో ఉంచుతుంది. పదిమందికీ త్వరగా సోకకుండా ఆపుతుంది, ఈ లోపుల వైద్య సహాయాలు తీసుకునేటప్పుడు ... మరి కొన్ని సాధనల వల్ల పూర్తిగా వ్యాప్తిని అదుపులో వుంచుతుంది. 

యాంటీజెనిక్ షిఫ్ట్: ఒక duck గాని లేదా ఏదైన నీటిలో తిరిగే పక్షి కి ఫ్లూ అటాక్ అయ్యిందంకోండి.. వాటికి దగ్గిరగా తిరిగే చికెన్ కో పిగ్ కో పాస్ చేస్తుంది. ఈ లోపుల influenza వైరస్ కలిగివున్న ఏ హ్యూమనో వాటికి దగ్గిరకి రాగానే ఆ హ్యూమన్ వైరస్ కూడా చికెన్ కో, పిగ్ కో సోకుతుంది. ఆ చికెన్ లేదా పిగ్ లో ఈ వైరస్ లన్నీ ఒకటే కణానికి ఇన్ ఫెక్ట్ అయ్యినప్పుడూ ఈ strains నుండి జీన్సు మిక్స్ అయిపోయి ఒక క్రొత్త strain గా మారుతుంది. ఇలా మారినదే ఇప్పుడు మహమ్మారిలా విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.

ఈ లేటెస్ట్ స్వైన్ ఫ్లూ లో 8 RNA strands (Virus contains RNA as a hereditary material) ని కలిగివుంది. ఓకె.. ఎలాగూ తన స్వంత స్వైన్ (H1N1) స్ట్రాండ్స్ 5, ఏవియన్ (avian, అంటే పక్షి ది) అంటే పక్షి ది స్ట్రాండ్సు 2 మరియు హ్యూమన్ ఫ్లూ వైరస్ నుండి ఒకటి. ఈ క్రొత్త స్వైన్ ఫ్లూ స్నీజింగ్, కాఫింగ్ ద్వారా ఒక మనిషినుండి మరో మనిషికి సోకుతుందే తప్ప పిగ్ నుండి కాదు. ఈ క్రొత్త వైరస్సు కి మరోపేరు ఇన్ ఫ్లూయింజా “H3N2V”. V అంటే వేరియంట్ (variant) అని అర్ధం. ఎలా వేరియంట్ అయ్యిందంటే, ఒరిజినల్ గా వైరస్ పిగ్ ని ఇన్ ఫెక్ట్ చేసేసేది, కాని ఈ వేరియంట్ మనుష్యులని ఇన్ ఫెక్ట్ చేస్తుంది. ఈ వైరస్ 2011 లో అవుట్ బ్రేక్ అయ్యింది. ఇండియాని పట్టి కుదుపుతున్నది ఇదే.

ఎప్పటికప్పుడు ఫ్లూ వాక్సిన్స్ ని తయారుచేసి అరికడితున్నా... కొన్నేళ్ళు పోయాక మళ్ళీ ఫ్లూ మహమ్మారిలా ఎందుకు తలెత్తుతుంది?

పిగ్ యొక్క రెస్పిరేటరీ సెల్ లో హ్యూమన్ ఇన్ ఫ్లూయింజా వైరస్ అలాగే అదే సెల్ కి స్వైన్ ఫ్లూ వైరస్ కూడా ఇన్ ఫెక్ట్ అయినప్పుడు, పొరపాట్నఈ హ్యూమన్ వైరల్ స్ట్రాండ్సు, స్వైన్ వైరల్ స్ట్రాండ్స్ తో ఎన్వెలోప్ అయిపోతుంది. అంటే ఒక్క సెల్ లో 8 స్వైన్ ఫ్లూ వైరల్ స్ట్రాండ్సు, 8 హ్యూమన్ ఫ్లూ వైరల్ స్ట్రాండ్సు కలిసి మొత్తం 16 టైపులు గా, డిఫరెంటు కాంబినేషన్స్ లో వైరస్సులు తయారవుతాయి. దీనినే యాంటీజెనిక్ షిఫ్ట్ అని అంటారు. ఒక్కొక్క సబ్ టైపు లో ఒకొక్కరకమైన జెనిటిక్ కాంపోజిషన్ (genetic composition) ఉండడం వల్ల ఆ పర్టిక్యులర్ వైరల్ స్ట్రయిన్ విలక్షణమైన లక్షణాలు కలిగివుండి ఒకసారి బలోపేతమైన వైరస్సులు, మరోసారి మైల్డ్ వైరస్సులు వాటి వాటి ఇంక్యుబేషన్ టైమింగ్సు ను బట్టి అవుట్ బ్రేక్స్ జరుగుతున్నాయి, దీనికి సంవత్సరాలు పడుతున్నాయి. వాక్సిన్లు కూడా వైరస్సు బయటపడ్డాకే దాని లక్షణాలని బట్టి ముందు గుర్తించి తరువాత చేయగలిగే పరిస్థితి. కాకపోతే.. కామన్ గా ఈ వైరస్సులన్నిటికీ కొన్ని లక్షణాలుంటాయి కాబట్టి, డాక్టర్లు, హెల్త్ అఫీషియల్సు ఉన్న వాక్సిన్స్ ని ముందు ఉపయోగిస్తుంటారు. ఇది కొంతవరకు లక్షణాలని, వ్యాప్తిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది.

మరి ఈ వాక్సిన్లని తయారుచెయ్యడానికి ఏ విధం గా వైరస్సులను కనుక్కొంటారు?

ఒకొక్క virus type కి నిర్ధిష్టమైన యాంటీజెన్స్ లేదా సర్ఫేస్  ప్రోటీన్సు ఉంటాయి. వాటిని అన్నిటినీ టెస్టు చేసి కనుక్కుంటారు. క్రొత్త క్రొత్త వెరస్సులకి వాక్సిన్లను తయారు చెయ్యాలంటే.. రిఫెరెన్సె గా.. పాత వైరల్ స్ట్రయిన్ డాటాలు, అలాగే ఆల్ రెడీ వైరల్ అటాక్ కి గురి అయిన పేషంట్ల స్యాంపుల్స్ ని World health organization (WHO), Centres for disease control and prevention (CDC) ఆరోగ్య సంస్థలు కలెక్ట్ చేసి పెట్టుకుని.. ల్యాబ్స్ కి పంపుతారు. ఈ వాక్సిన్లని killed viral particles నుండి తయారుచేస్తారు. దాన్ని మనిషిలో ఎక్కించి, immunity ని అభివృద్ది చేస్తారు. నేసల్ స్ప్రే లో మాత్రం లైవ్ వైరస్ వుంటుంది, కాని అది రెప్లికేట్ అయ్యే లక్షణాన్నికోల్పోయివుంటుంది. ఇమ్మ్యూన్ సిస్టం పనిచెయ్యని వాళ్ళకి, ఈ నేసల్ స్ప్రే ని ఇవ్వకూడదు. ఈ స్వైన్ ఫ్లూ ని తగ్గించడానికి.. రెండు యాంటీ వైరల్ ఏజెంట్స్ ని వాడారు, రెలింజా మరియు టేమీ (Tami) ఫ్లూ ఒక వాక్సిన్ గా. ఇది ఇన్ ఫ్లూయింజా ఏ, బి వైరస్సులను అరికట్టడానికి ఉపయోగపడుతుంది. మొన్న 2014 డిశెంబర్ 22 న ఒక డ్రగ్ ని అప్రూవ్ చేసింది- యాంటీ ఇన్ ఫ్లూయింజా డ్రగ్. 15 సంవత్సరాల కృషి. పెరామివిర్ ఇన్ జెక్షన్ దీనినే “రేపివెబ్” అని అంటారు.

ఒకపక్క వాక్సిన్లను వేసుకోమంటున్నారు, మరోపక్క న్యూరోలాజికల్ డిసార్డర్స్ వస్తున్నాయి వేసుకుంటే అని అంటున్నారు? ఏది నిజం?

రెండూ నిజమే. కానీ రెండూ రెండు independent  విషయాలు. ఎలా అంటారా?

CDC ఇచ్చిన రిపోర్ట్ పకారం ఏమిటంటే. యూరోపియన్ కంట్రీస్ లో 2009 లో వచ్చిన ఇన్ ఫ్లూయింజా వాక్సిన్ లో ఒక అడ్జువెంట్ (adjuvant) ని వాడారు. దానిపేరు పేండర్ మిక్స్.  గ్లాక్సోస్మిత్ ఫార్మాస్యుటికల్ కంపెనీ వాళ్ళు ఇన్ ఫ్లూయింజా వాక్సిన్ తయారీ లో వాడినది. ఈ అడ్జువెంట్స్ యొక్క ఉపయోగం ఏమిటంటే వీటిని వాక్సిన్లలో కలిపి ఇస్తారు. బాడీలోకి ఎక్కించగానే ఇమ్మ్యూన్ రెస్పాన్సెస్ ని అధికం చెయ్యడానికి. ఇది ఆల్ఫా-టోకోఫెరాల్, సీక్వెలీన్ మరియు పాలీ-సార్బేట్ 80 లాంటి కెమికల్ ఏజెంట్స్ తో తయారుచేసి నవి ఈ అడ్జువెంట్లు. ఇది ఒక ఆయిల్-వాటర్ ఎమల్షన్. ఈ ఎమల్షన్ ని కలిపి వాక్సిన్ ని ఇచ్చినప్పుడు.. ప్రజలకి స్లీపింగ్ పేటర్న్ మారి Narcolepsy అనే న్యూరోలాజికల్ డిసార్డర్ కి దారితీసిందని చెప్పారు. ఈ సమస్యని మొదటిసారిగా కనుక్కొన్నది ఫిన్ ల్యాండ్ లో ఆ తర్వాత మరికొన్ని యూరోపియన్ దేశాలలో. ఈ మధ్య కాలం లో నే యూ.కె లో ఈ పేండర్మిక్స్ కి, నార్కొలెప్సీ తో సంబంధం ఉందని తేల్చి చెప్పారు కూడా.  కానీ.. ఈ పేండర్ మిక్స్ కి యునైటడ్ స్టేట్స్ లో లైసెన్స్ ఇవ్వలేదు. కాబట్టి.. ఈ పేండర్మిక్స్ ఇప్పుడు ప్రస్తుతం చెలామణిలో వున్న ఏ ఫ్లూ వాక్సిన్ లోనూ కలవలేదు. 


2 comments:

  1. Replies
    1. Thank you Suresh garu. ఈ వ్యతిరేకత USA లో కూడా ఉంటున్న్నది. సగం awareness లేక పోవడం అయితే, మరో సగం కల్చరల్ గానో, పొలిటికల్ గానో వ్యతిరేకత చూపించడం జరుగుతున్నది. కనీసం awareness వల్ల అయినా వీటినుండి బయట పడతారేమో అని.. చిన్న ప్రయత్నం !!!

      Delete