గౌతమి

గౌతమి

Saturday, December 31, 2016

Happy New Year 2017

https://www.youtube.com/watch?v=A6RXP3w5Oh4
.
తల్లీ బిడ్డకున్న ప్రేగు బంధం 
ప్రేయసీ ప్రియుల అనురాగం
గురు శిష్యుల మధ్య విశ్వాసం
మనిషికీ కాలానికి ఉన్న బాంధవ్యం
మారనిది చెరగనిది చిరగనిది
మోడీ అన్న 2000 నోటులా
.
నేటివరకూ అన్ని రాగాలని
సరాగాల పేరుతో నోట్లుగా మార్చుకున్న
అశేష జనావళికి ...
మార్పు "సంభవామి యుగే యుగే" యని
తెలియజెప్పిన 2016 కు జోహార్
.
కాదనలేదు కొన్ని అభ్యంతరాలు
లేదనలేదు కొన్ని అనివార్యాలు అసంభవాలు
సంభవింపజేసుండొచ్చు
మనోభావాలను దెబ్బతీసుండొచ్చు ...
కుటుంబ కలతలను రేపుండొచ్చు
ప్రేమికులను విడదీసి బాధించుండొచ్చు
ప్రమోషన్లను ఆపుండొచ్చు
ఇంక్రిమెంట్లను పెంచకపోయుండొచ్చు
ఆఫీసర్ల మతులను గతులను తప్పించుండొచ్చు
.
ఆన్నిటికీ కాలమే పరిష్కారమని
మతులను గతులను ఈ రోజుతో అఖరని
మనసున రధం ముగ్గేసి తాడు కట్టి లాగు
అద్దంలాంటి ఆడపిల్ల మనసులా
క్రొత్త సంవత్సరం వస్తుందనే ఉల్లాసాన్ని
ఊపిరిపీల్చు ...2017 ని ఆహ్వానించు ...
.

బూజు పట్టిన పాత మతిని మార్చు
2017 కైనా నువ్వేమివ్వాలనుకుంటున్నావో ఆలోచించు
అవసరానికి అవసరమయ్యే డబ్బే సంపాదించు
ఆశలను పెంచే డబ్బుకు ఉరకలువేయకు
చెంచులక్ష్మిచ్చే చాంచల్యాన్ని వదులు
స్థిరలక్ష్మిచ్చే స్థిరత్వానికి అలవాటుపడు
ఆరోగ్యం అదే వస్తుంది!





Sunday, November 6, 2016

తుది నిర్ణయం తనదే!!!


మన సహాయం ఎవరైనా అర్ధిస్తే, తప్పక చేయడంగానీ, లేక చేయించడం గానీ మన ధర్మమని షిరిడీ సాయినాధులవారు చెప్తుండేవారు. వారుగూడా యీ ధర్మం పాటించారు. ఒకప్పుడొక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టరు త్రోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, "నీవు నానా చందోర్కర్ తో కలసి కణీత్కర్ తో మాట్లాడు, నేను నానాతో చెబుతాను అన్నారు. తర్వాత నానా సహకారం వలన కలెక్టరు అది మంజూరు చేశాడు. అతడుబావి త్రవ్వించుకొని, పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు.
                                                                   -శీ సాయిలీలామృతము
                                                                     అధ్యాయము-9_ఉపదేశాలు విభాగము
                                                                     రచన: ఆచార్య శ్రీ యక్కిరాల భరద్వాజ

"ఈ ధర్మం వారు కూడా పాటించారూ" అంటే గుర్తొచ్చింది. అది నిజమే. నా స్వానుభవం కూడా. 2013 లో అమెరికాలో పున:ప్రవేశం చేసినప్పుడు ఒక తెలుగు కుటుంబం (ఇంతకు మునుపు కాస్త తెలిసినవారు) తో ఇంకాస్త పరిచయం పెరిగింది. వాళ్ళు సాయి భక్తులని అప్పుడే తెలిసింది ఇంకాస్త పరిచయంలో. ఇంతలోనే వాళ్ళు ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు. నేనుండే అపార్ట్మెంట్స్ నుండి వాళ్ళ ఇల్లు చాలాదూరం కూడా, కాకపోతే పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ ఉంది వాళ్ళ ఇంటికి దగ్గిరగానే. దగ్గిరలో దిగి, ఇంటికి నడుచుకొని వెళ్ళాలి. అప్పుడే పున:ప్రవేశం చెయ్యడంవల్ల నేనింకా కారు కొనలేదు అప్పటికి. అందువల్ల ఎక్కడ తిరగాలన్నా దగ్గిర ప్రాంతాలకే పరిమితమయ్యాను. కాని ఏం విచిత్రమో ... అంతదూరంలోవున్న వీళ్ళ ఇంటి గృహప్రవేశానికి మాత్రం దీక్షబూనినట్లు కష్టమయినా పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ తీసుకొని ... లోకల్ టైన్స్ మిస్ అయినా కూడా ... గంటల సేపు నిరీక్షించి మరీ వెళ్ళి వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. భార్యా భర్తలిద్దరూ ఆయా కార్యక్రమాల్లో కూర్చొనివున్నారు, పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు. ముఖ్యంగా ... వారికి ఇతర అతిధులు వచ్చి వున్నా అందరిలోకి నన్నే పూజారి కూడా పిక్ అప్ చేసి వాళ్ళ ఇంట్లో మనుష్యులకి చెప్పి చేయించేటట్లుగా కొన్ని విధివిధానాలను నా చేతులమీదుగా చేయించారు. నేను కూడా ఏమాత్రం కూడా తడబడకుండా చక చకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసాను. అయితే జస్ట్ అంతకు మునుపే నా స్వంత ఇంటి శంకుస్థాపన కార్యక్రమాలు నా చేతులమీదుగా చేసివున్నానుకోండి. అయితే అది వీళ్ళకు తెలియదు కదా, అందులోనూ పూజారిని అదే మొదటిసారి కలవడం, కాబట్టి చాన్సే లేదు నాకున్న ప్రాక్టీస్ గురించి. దీని వెంటనే అలా వాళ్ళు సాయిబాబా పూజ చేసుకొంటే దానికీ ఒక ముఖ్య అతిధిగా వెళ్ళడం జరిగింది. ఇదంతా అయ్యాక, నాకే చాలా ఆశ్చర్యం వేసింది... ఈ ప్రయాణ ప్రయాసలకోర్చి నేనేనా అంత దూరం వెళ్ళినది అని? తర్వాత అప్పుడే అనుకున్నాను బాబాగారి లీలమృతంలో ఎన్నో కధలున్నాయి. 

                                          (పైన చూపబడిన చిత్రం గూగుల్ నుండి)
ఉదాహరణకు ఎక్కడో తన భక్తుల ఇంట వారి బిడ్డ ప్రసవవేదన పడుతుంటే అక్కడ వారా బాధలో తనని తలచినంతనే తన వద్ద కూర్చొన్న మరో భక్తుడికి విభూతినిచ్చి ఆమెకిమ్మని చెప్పి పంపుతారు. అలా తన భక్తుల ఇంట్లో అవసరానికో, ఆపదల్లో ఉన్నప్పుడో ... సర్వజ్ఞుడిగా అన్నీ ముందుగా తెలుసుకొని సమయానికి తన మరో భక్తులని పంపి వారి అవసరం తీరుస్తారని. ఎవరి అవసరాలు ఎలా తీరాలో తానే నిర్ణయించి ఆదేశిస్తారని. ఆ రెండు కార్యక్రమాల తర్వాత ఆశ్చర్యంగా మేము మళ్ళీ ముఖాముఖి కలుసుకునే అవకాశం ఏర్పడలేదు. కాని ఆ సమయం లో మాత్రం చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్లే వెళ్ళాను. తన భక్తులని ఎప్పుడు, ఎలా కనెక్ట్ చెయ్యాలో తెలిసిన ఏకైన జ్ఞాని ఆ సద్గురువే. బాబాగారు అనేవారుట ... నా భక్తుల పూర్వజన్మ సుకృతం మేరకు వారు నన్ను కనుక్కునే తీరుతారు, వాళ్ళ వద్దకు నేనే వెళతాను లేదా ఏదైనా కోరికల (మానవ జన్మకు అది సహజవిధానము) మేరకు వారే నన్ను సమీపించి అక్కడినుండి నాతో అడుగులు వేస్తారని.

ఈ వేళ లీలామృతాన్ని పారాయణం చేస్తుంటే కరెక్ట్ గా ఎక్కిరాలవారు రచించిన ఆ పాయింట్ల దగ్గిరకి వచ్చేటప్పుడు 2013 లోని ఈ సంఘటన గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా సద్గురువు యొక్క సందేశమే ఈ లీలామృత పారాయణం. హటాత్తుగా కూర్చొబెట్టి చదివిస్తున్నారు ఒక ముఖ్య విషయార్ధమై.
.

శ్రీ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై!

Saturday, November 5, 2016

ఇవాళ్టి ఆంధ్రప్రభ (తెలంగాణా ఎడిషన్) ఆదివారం స్పెషల్ బులిటన్ (06.11.16) లో ప్రచురింపబడిన నా కధ "పునాదిరాళ్ళు".

మీ అందరితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది. తప్పకుండా చదివి ఎలావుందో అభిప్రాయం తెలుపగలరు. ధన్యవాదాలు. Please click on each image to see it bigger.








Sunday, September 11, 2016

2016 ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్, America Telugu Association) వారి చికాగోలో జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుక సంధర్భంగా వెలువడిన సోవనీర్ బుక్ (ప్రత్యేక జ్ఞాపిక/సంచిక) "సంస్కృతి".


************
అందమైన మరియు విజ్ఞానదాయకమైన ఈ సోవనీర్ బుక్ ప్రచురణకు సమిష్టి కృషి చేసిన కమిటీ లోని నా తోటి మెంబర్స్ అందరకూ, అలాగే మంచి ఆర్టికల్స్ అందించిన రచయిత(త్రు)లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 
.
అంతేకాకుండా ఈ బుక్ లో ప్రచురింపబడిన నా స్వంత రచన "తెలుగు సాహిత్యంలో స్త్రీపాత్ర స్వభావ పరిణామ క్రమం" అందరికీ నచ్చడం మరింత ఆనందదాయకం. ఇంకా చదవడానికి మిగిలినవారు తప్పక చదవండి, ఎలావున్నా చెప్పండి. థాంక్ యూ సో మచ్.
.
Lastly but not least ఇటువంటి సదవకాశాన్ని ఆటా వారు మా కమిటీకి అప్పజెప్పడం, అది విజయవంతంచేయగలగడం దైవనిర్ణయం. ఆటా కు అభినందనలు.














Tuesday, August 16, 2016

నా కవిత "ఆత్మబంధనం" తానా పత్రిక-ఆగస్ట్ సంచిక లో !!!









                    English translation of the poetry above.


                    You filled my heart and ruled 
                    the night with all your memories
                    like moon light ruled all the night
                    .
                    You might thought you cant come over here
                    When I am awake
                    So you made me to slide into sleep
                    And then kept me awaken along with you in the dream
                    .
                    You left me this side and flew away
                    to other side of the globe
                    thought I die every minute
                    with out you next to me
                    but,
                    you changed your day light into
                    mansoon winds with your sandal breaths
                    and poured on me which brought my life back
                    .
                    Now,
                    Silence all over
                    Except the waves which are moving
                    And touching the lil stones
                    Which are sounding with your wind chimes
                    .
                    While your wind chimes
                    Sweetly touching my heart
                    there a beautiful love bond took place in a form of you
                    .
                    Was this a dream?
                    Or a devasted state from my heart in your absence?
                    .
                    No itseems, my soul says,
                    It is a bonding between two souls of you and me !

Friday, August 12, 2016

నేనూ- నా వరలక్ష్మీ పూజ...

ఆగస్ట్ 12, 2016

ప్రతి సంవత్సరం అలవాటయిన షోడ శోపచార పూజ... ఎంత అలవాటున్నా దానికి పట్టే టైము దానికి పట్టేస్తుంది, టైం లేదుకదా అని ఎంత కుదించాలనుకున్నా పెద్దగా కుదరదు... ఎందుకంటే అసలు వ్రత విధానం సాధారణం గా క్లుప్తంగానే ఉంటుంది, పైగా తెచ్చుకునే వస్తువులు కూడా సింపుల్ వే. ఏముంటాయండీ మహా అయితే ఒక పదీ, పన్నెండు వస్తువులు.

1. పండ్లు
2. పూలు
3. ఆకు,వక్క
4. పంచామృతం
5. రవిక (కుదిరితే చీర కూడా)
6. గంధం
7. అక్షితలు
8. తోరాలు
9. నైవేద్యం
10. అగరొత్తులు
11. కొబ్బరి కాయలు
12. హారతి కర్పూరం

కానీ ఇంటి శుభ్రం, వంటి శుభ్రం, పూజా సామాగ్రి తోమడాలు, కలశం, బొట్లు పెట్టడం, నైవేద్యాల తయారీ, తోరాలు చెయ్యడం ... వీటికి టైం పడుతుంది. మన పెద్దలు మనకిలాగే నేర్పారు మరి. కానీ ఇల్లు, వొళ్ళు, పూజా సామాగ్రి శుభ్రాల్లో అప్ టు డేట్ గా వుంటే సగానికి పైగా పూజకోసం రెడీ అయినట్లే. దీనివల్ల పన్లను కొంచెం కుదించుకోవచ్చు. ఇక మిగిలేది కేవలం లక్ష్మీ పూజే.

ఇవాళ నా పరిస్థితి అయితే ఇంకా విచిత్రం. గత మూడు వారాలనుండి ఎడతెరిపిలేకుండా వర్క్ బిజీలో ఉన్న నేను సాయంత్రం 4.30 వరకూ తెలియదు శ్రావణ శుక్రవారం చెయ్యగలనని. తరువాతి శుక్రవారమే కుదరొచ్చులే అనుకున్నాను.

మూడు వారాలనుండీ ఎడతెరిపిలేకుండా చేస్తున్న వర్క్ కి, కత్తి లాంటి రిజల్ట్ రావడమే కాకుండా ... పెండింగులో ఉన్న మరికొన్ని పరిష్కరింపబడడమే కాకుండా ... ప్రొద్దున్న ఒక మంచి వార్త (వేరే యూనివర్సిటీ నుండి అహ్వానం- ఒక చిన్న సైజు "అంతర్జాతీయ కవి సమ్మేళనం లో వాళ్ళ యూనివర్సిటీ స్టూడెంట్ల కోసం పాల్గొనమని"- అదీ అమెరికా లో ... unbelievable !!!).

సాయంత్రం మరో మంచి వార్త (ఒక రీసెర్చ్ పేపర్ జర్నల్ కి యాక్సెప్ట్ అయ్యింది (హోరా హోరీ పోరాటాలు జరిగాయి రివ్యూయర్లతో)). ఆ పేపర్ కి  మెయిన్ వర్క్ చేసి దాని రూపానికొక మూలాధారాన్ని కల్పించాను.

ఇలా మంచి వార్తలు ముసరడంతో ... ఎక్కడ్లేని ఉత్సాహంతో చెలరేగింపు వచ్చేసింది. ఉన్నపళంగా నా డెస్క్ టాప్ మీదకి ఆవిడ వచ్చి కూర్చున్నారు.


ఇహ చల్... ఇక్కడ చేసింది చాల్లే అని ఇంటికి తరిమారు, ఫొటో చేతిలో పెట్టిమరీ !!! ఇహ కలశం, ఆవాహనం అదీ ఇదీ ...అని చెప్పే పనేముంది? ఏకంగా తానే వచ్చేస్తే. అంతే ఇంటికొచ్చేసరికి మా అమ్మాయి కూడా ...చక్కగా తలంటుపోసుకొనుంది, కనీసం ఒక్కసారికూడా నేను అరవలేదు, పంటికున్న బ్రేసెస్ నొప్పి అని అసలేమీ తినలేదు, ఆమెకది ఒక ఉపవాసంలా అయిపోయింది. అరిచే పని లేకపోవడం వల్ల నేను చేసుకొనే పన్లు ఇంకా తేలికయిపోయింది, చీకటి పడే లోపుల ఇలా పంచసంఖ్యోపచారం పూర్త్యిపోయింది,


మా అమ్మాయికూడా నాతో కలిసి అష్టోత్తరం పూర్తిచేసేసింది. కరెక్ట్ గా ఒక గంట... ఆవిడ తనకు కేటాయించేసుకుంది. తర్వాత మా అమ్మాయి పళ్ళనొప్పంటూనే తీపట్లు, పళ్ళు తినేసింది, హాయిగా ఉంది. భలే విచిత్రం.

ఈ సంధర్భంలో ఒక పురాణ కధ గుర్తొచ్చింది. దూర్వాస మహామునికి ఇంద్రుని ఆతిధ్యం నచ్చి ఒక విలువైన హారాన్ని ఇంద్రునికిచ్చాడట. ఆ ఇంద్రుడు దాన్ని తీసుకెళ్ళి ఐరావతానికి అలంకరించాడుట. ఆ ఐరావతం దాన్ని కాళ్ళ క్రింద వేసి, త్రొక్కి ముక్కలు చేసిందిట. అది చూసి మన దూర్వాసులు కోపించి ఇంద్రుడ్ని శపించాడుట, ఏమనీ? నీకున్న సర్వ సౌభాగ్యాల్నీ, రాజ్యాన్ని పోగుట్టుకో అని. అలాగే అన్నీపోయాయి. ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలియక విష్ణువునాశ్రయించాడుట. విష్ణు "సర్వ సంపదలనూ ఇవ్వగలిగేది లక్ష్మే. కాబట్టి ఒక జ్యోతిని వెలిగించి, అది ఆవిడ స్వరూపంగా భావించి భక్తొశ్రద్ధలతో ప్రార్ధించి చూడు" అని అన్నాడుట. పాపం ఇండ్రుడు అలాగే చేశాడుట. అంతే దేవి ప్రసన్నురాలై పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి ఇంద్రుడిని మళ్ళీ నిలబెట్టిందిట.

అంతేకాదు తాను మోక్షం, విద్య, విజయం, సంతానం, సౌభాగ్యం, సంపద మొదలైన "న్యాయపరమైనవి " "భక్తిశ్రద్ధల" తో ఏమడిగినా ఇవ్వడానికే "వరలక్ష్మి" నై ఉన్నానని కూడా చెప్పిందిట.


ఇంద్రుని కధనుండి, నా కధనుండి  అర్ధమయిందేమిటంటే- అనుకోని విధంగా ఇరకాటంలో పడినప్పుడు సింపుల్ గా పూజచేసినా కూడా దేవీ దేవుళ్ళు ఏం ఫీల్ అవ్వరు, పైగా సహకరిస్తారు. అదీ దైవలక్షణం !!!

నాలాగా, ఇంద్రుడిలాగే కాకుండా మరేవిధంగా అయినా ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పూజచేసుకున్నా కూడా మీ అందరికీ ఆ వరలక్ష్మీ దేవి శుభాశీస్సులు !!!


Friday, April 15, 2016

సీతారాములకళ్యాణంచూతమురారండి!


చంద్రకాంతులు తేనెచుక్కలుగ మారి
దివి తారకలు గులాబీలుగ పేరి
మలయమారుతం సుగంధాలు వెదజల్లి
రంగరించిన రంగరింపు మా సీత
పన్నీటిజలకమాడి పుష్పాంజలి చేతబట్టి
స్వయంవరమునకరుదెంచె వరమాలతోడ
ఎందరో రారాజులు.. కాంచన సీతనుంగాంచి
మతిపోయి శ్రుతితప్పి శివధనుఁ విరువ తన్నలాడె

సీతమనస్సునెరింగిన శివధనస్సు వింటినారితో పలికె
ముదియ కోరిన మగడు శ్రీరాముడే రావలె ధనస్సు విరువ
వింటి నారి ధనస్సును కొంటెగా సైగ జేసి కిసుక్కున నవ్వి
రతీమన్మధులు సీతారాముల వైవాహిక సంభవానికి నాంది పలుక
ఎవ్వరు విరతురీ..శివధనస్సు..నా బోటి వింటినారినెక్కుబెట్టి



తలచినంతనే అరుదెంచె శ్రీరాముడు శివధనస్సు కడకు
క్రీగంట జూసె పూబాల సీతమ్మను వరమాలతోడ
చెయ్యిజాచి శివధనస్సును పేర్కొని శ్రీరాముడు ధనుర్భంగంగావించె
శ్రీరాముని చేతిస్పర్శకు వింటినారి ఒడలు పులకించె

ఆ ఉదుటున చిన్నారి సీత ఉల్లము ఊప్పొంగె
శ్రీరామునికి అంజలి ఘటించి వరమాల తో స్వయంవరించె
శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్య కేతెంచె..ఇక పెళ్ళి భోగొట్టా ఉరూరు వ్యాపించె
ఆ ఊరు, ఈ ఊరు ప్రతి ఊరు ముస్తాబించి పెళ్ళిపందిళ్ళు వేయించె
ఆణిముత్యాల తలంబ్రాల తో సీతారాముల మాంగల్యధారణ గావించె!









ఇమేజ్ లు గూగుల్ నుండి.

Wednesday, February 24, 2016

// నువ్వు మరణమే లేని ప్రేమవు.... // 24.02.16_"విహంగ" మహిళా వెబ్ పత్రికా సౌజన్యంతో నా క్రొత్త కవిత ప్రేమికులకోసం.

http://vihanga.com/?p=16570#sthash.A3QRV1sW.dpbs

నిను వీడివెళుతున్నా కానీ                                                  
నా మనసు నీ చెంత వదిలెళుతున్నా అన్నావని
నీతో గడిపిన క్షణాలని తలుచుకొని
గడుపుతున్నా నువు లేని ప్రతి క్షణాన్ని...
.
నినువీడి వెళుతున్నా కానీ
నా గుర్తులు నీకై వదిలి వెళుతున్నా అన్నావనీ
కనీసం బ్రతికున్నా!...తలుచుకుంటూ నీ తీపి గుర్తులని
అవే నా ప్రేమకి ఉచ్చ్వాస నిశ్వాసాలని
.
నా వెంట నువ్వుంటున్నావని
బయటికెళ్ళి లోపలికొస్తే నువ్వు ఎదురయ్యావని
పదిమందిలో ఉన్నా నువ్వు పిలుస్తున్నావనీ
ఎంత తలచి రోజులు గడిపినా
.
నిన్ను స్పర్శించలేని చూడలేని నా జన్మ వ్యర్ధమని
చెప్తుంది నా కన్నీరు నిన్ను చేరమని.....
.
దేవుడు ఆడించే నాలుగు స్థంభాలాటలో నువ్వుతప్పుకున్నావ్
నా హృదయం పగులగొట్టావ్ ఆ దేవునితో చేతులు కలిపి
వంటరిగా ఆట పూర్తిచెయ్యమని మళ్ళీ భుజం తడుతున్నావ్
.
నీ నమ్మకం దేవునిమీద నా నమ్మకం నీ మీద
శాపమో వరమో అర్ధం కాని నా జీవిత పయనానికి
మళ్ళీ నీవే ప్రాణవాయువయ్యావ్
.
ప్రాణం తీయనూగలవు మళ్ళీ పోయనూ గలవు
ఇదే నీ నైజం కాబోలు అందుకే నువ్వు మరణమే లేని ప్రేమవు…..
.
(ప్రేమించిన తన మనిషి అస్తమయంతో బ్రతికున్నా తానూ ఇకలేనని పరితపించిన అమ్మాయి, అతని ఊహలు, జ్ఞాపకాలు తిరిగి తనకు ప్రాణవాయువయి తనలో శక్తిగా మారిందనీ అది ప్రేమనైజం అనీ, దానికి మరణమే లేదనీ తనలోనే బ్రతికుందని అర్ధం చేసుకొని నమ్మిన కోణం నుండి వ్రాసిన కవిత)

-డా.శ్రీసత్యగౌతమి, ఫిలడెల్ఫియా, అమెరికా

Monday, January 4, 2016

గర్భాశయ సమస్యలకు దారితీసే హైపోథైరాయిడిజం, రక్తప్రసరణ వ్యవస్థ





ఇది నా ఆర్టికల్ 2015 డిశెంబర్ 27 న విశాలాంధ్ర, ఆదివారం బుక్కు లో పడింది.








Saturday, January 2, 2016

పుస్తకానికీ ఒక మనసుంటుందా?


ఎందుకుండదు మనసులోని మాటే అక్షరాలుగా మారి పుస్తకమయినప్పుడు? ఈ పుస్తకం పేరు "తరాలు-అంతరాలు". అమ్మాయికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక అక్కడ మనుష్యులే కాదు, వాళ్ళు ధరించే విబ్భిన్న పాత్రలు ఆ పాత్రలతో ఈవిడకి సర్దుబాట్లు లేదా పోరాటాలు మొదలవుతాయి. ఓరిస్తే ఓరుగల్లంత పట్నం అంతే తప్ప గెలుపు ఓటమిలనేవి ఎవరికీ వుండదు. అందుకే "నా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామా, ఏ తీరుగనను దయజూచెదవో" అనే తత్వం పాడబడింది. ఈ విషయం అందరికీ తెలిసినదే. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే,

పదిహేడుమంది రచయిత్రులు వాస్తవకధలను చర్చిస్తూ, ఇక్కడ కధ అనేబదులు జీవితం అంటే బాగుంటుందేమో. ప్రతిజీవిత గాధనుండి ఒక క్రొత్త అంశాన్ని వెలికితీసి తమదైన బాణీలో, ఆలోచనా శైలితో వ్రాసి క్రొత్త ఆలోచనలని ప్రతిపాదించారు. చదివిన ప్రతిఒక్కరికీ, ఈ క్రొత్త ఆలోచనలు సాగే జీవిత రహదారిలో ఎక్కడోదగ్గిర ఉపయోగపడితే అంతకన్నా ఇంకేంకావాలి? అందుకే దీన్ని నేను ఒక ప్రయోగాత్మక కధల సంపుటి అని అంటాను.

చెప్పడం మర్చిపోయా, నేనూ కూడా ఒక జీవితకధని ఇందులో వ్రాశాను. ప్రతిఒక్కరూ ఈ పుస్తకాన్ని లింగభేదం లేకుండా తప్పకుండా చదవాలి. గ్రుడ్డిగా జీవితాల్లోకి అడుగుపెడతాం. ఆకస్మిక మార్పులకు, అనుభవాలకు అలసిపోతాం. ఇలాంటి పుస్తకాలు చదివేటప్పుడు ఏదో ఎక్కడో జీవితంలో ఇలాంటిదే జరిగినట్లుందే అని ఆశ్చర్యపోతాం. ఇలా మనకొక్కళ్ళకే కాదు, వేరే వాళ్ళకి కూడా జరుగుతున్నదన్నమాట, అయితే మనం వంటరివాళ్ళం కాము, అవతలివాళ్ళు ఎలాగయితే తట్టుకున్నారో, మనమూ తట్టుకోవాలనే దైర్యమొస్తుంది. ఇలాంటి పుస్తకాలు చదివితే అందులోని అంశాలను బట్టి క్రొత్త ఆలోచనలు పుంతలు వేసి, తీసుకునే నిర్ణయాలు మరింత మెరుగుపడతాయి, అందుకే మంచిపుస్తకం జీవితానికి అవసరం. అందుకే ఈ పుస్తకం మీ కోసం. దీన్ని పొందడానికి నవోదయా, విశాలాంధ్ర బుక్ షాప్లలో దొరుకుతుంది. లేకుంటే హైదరాబాదులో ఈ ఫోన్ నెం. 9494862254 లేదా 80963 10140 (సెల్) కి ఫోన్ చెయ్యండి, తక్షణం ఈ పుస్తకం మీ ముందుంటుంది. అమెరికాలో ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ చెయ్యండి. నా నెంబర్ 6108882724. హైదరాబాద్ ఫోన్నెంబర్లకు  కాంటాక్ట్ చేయదలిచిన వాళ్ళు నా పేరు మెన్షన్ చెయ్యండి. థాంక్ యూ.

పుస్తకరూపం ఎలా వుంటుందంటే......