గౌతమి

గౌతమి

Monday, January 26, 2015

మధుమేహం లేదా చక్కెర వ్యాధి (Insights of Diabetes)

Part 2

ఇన్సులిన్ సెన్సిటివిటీ (Insulin sensitivity) మరియు ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance): 



Part I లో ఒబీసిటీ ద్వారా ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance), ఆ పై డయాబిటిస్ సంప్రాప్తించడం అనేది తెలుసుకున్నాం. Part 2 లో ఇన్సులిన్ సెన్సిటివిటీ (Insulin sensitivity) యొక్క ఆవశ్యకతను తెలుసుకుందాము.

మనం తీసుకునే ఆహారంలో క్రొవ్వు పదార్ధాలు (fats), ప్రోటీన్లు (proteins) మరియు పిండి పదార్ధాలు (carbohydrates) వుంటాయి. ఈ ఆహారం జీర్ణక్రియ ద్వారా మరలా ప్రోటీన్సు (proteins) గా, సూక్ష్మపోషకాలు (micronutrients) గా, శక్తిని కలుగజేసే పదార్ధం గ్లూకోజ్ గా విచ్చిన్నమవుతుంది. ప్రోటీన్లను, సూక్ష్మ పోషకాలను కణాల జీవక్రియ (cellular metabolism) లలోనూ, వ్యాధి నిరోధక విధుల (immune functions) లోనూ, కణాల భర్తీ (Cell replacement) లోనూ శరీరం ఉపయోగించుకుంటుంది. గ్లూకోజ్ ని శరీరానికి శక్తినిచ్చే ఇంధనం గా వాడుకుంటుంది. ఆ ఇంధనం రక్తం ద్వారా ప్రతి ఒక్క కణజాలానికి వెళ్ళి వాటికి శక్తిని కలుగజేస్తుంది. ఈ ఇంధనం యొక్క ఆవశ్యకత టైం టు టైం కణజాలాలకు మారుతుంది. ఉదాహరణకి పరిగెత్తినప్పుడు ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది కాబట్టి, ఎక్కువ గ్లూకోజ్ వినియోగ పడుతుంది, ఇతరసమయాల్లో కన్నా. కానీ మెదడుకి మాత్రం స్థిరంగా గ్లూకోజ్ లెవెల్స్ అందుతూవుండాలి. అంటే మెదడికి అన్ని సమయాల్లోనూ ఒకే మోతాదు లేదా లెవెల్లో గ్లూకోజ్ ద్వారా ఎనర్జీ అందుతుండడమనేది చాలా ముఖ్యమైన విధి. ఈ విధిని నిర్వహించడానికే ఇన్సులిన్ ముఖ్యపాత్రని వహిస్తుంది. ఎలా అంటే.. రక్తంలోవున్న గ్లూకోజ్ ని శోషించమని ఇన్సులిన్ కణాలకి సిగ్నల్స్ ని ఇస్తుంది.  మనశరీరం మనం తీసుకున్న ఆహారం, దానినుండి తయారయిన గ్లూకోజు రక్తంలో కలిసి వివిధభాగాలకు ప్రయాణించడమే కాకుండా ఏ కణానికి ఎంత గ్లూకోజు కావాలనేదాన్ని కూడా మానిటర్ చేస్తూ వుంటుంది. దీనికి తగ్గట్టుగానే ఇన్సులిన్ ని కూడా కరెక్ట్ టైం లో కరెక్ట్ మోతాదులో కణాలకి గ్లూకోజ్ ని శోషించడానికి సిగ్నల్స్ ని ఇవ్వడానికి రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులినే గనుక తన విధిని నిర్వర్తించని పక్షంలో అనగా కణాలకి సిగ్నల్స్ ని అందివ్వకపోయినా.. కణాలు గ్లూకోజ్ ను రక్తం నుండి తీసుకోవు. దీనినే ఇన్సులిన్ నిరోధకత (Insulin resistance) అంటారు. దీనివల్ల కణాలు ఆహారం లేక శుష్కించడమే కాక, గ్లూకోజ్ వినియోగింప బడకపోవడం వలన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంది. ఇదంతా ఒక మెషినరీ. ఒకదాని ప్రభావం మరొక దానిపై పూర్తిగా వుంటుంది. వీటిలో ఏ ఒక్క విభాగం పనిచెయ్యక పోయినా మొత్తం మొదటికే మోసం వస్తుంది. 
ఇన్సులిన్ నిరోధకత వల్ల కణాలకు ఆహారం దొరకక పోయేసరికి ఆకలి వేస్తోందని, దాహం అలసట కలుగు తున్నాయని మెదడు సిగ్నల్ ని పంపిస్తుంది. వెంటనే మనిషి దాని ప్రకారం తింటుండవచ్చు, త్రాగుతుండవచ్చు అయినా కూడా ఇన్సులిన్ సిగ్నలింగ్ లో తేడా రావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి డయాబిటిస్ కి దారితీస్తుంది. దీనినే మెటబాలిక్ సిండ్రోము అని అంటారు. 20 ఏళ్ళక్రితం మెటబాలిక్ సిండ్రోము అంటే ఐడియావుండేది కాదు. ఈ రోజున ఇది డయాబిటిస్ కి మూలం అని తేలిపోయింది. ఇది డయాగ్నోస్ అవ్వడానికి ముందుగా మనిషిలో వచ్చే మెటబాలిక్ డిసార్డర్స్ ని పేషంట్లో కనుక్కోవాలి- అవి ట్రై గ్లిసెరైడ్స్ పెరుగుదల, కొలెస్టెరాల్ పెరుగుదల, రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల, రక్తపోటు. వీటన్నిటికీ సెల్ సిగ్నలింగ్ లో తేడా రావడమే మూల కారణం.

ఇన్సులిన్ మరియు స్త్రీ హార్మోనులు:

ఈ సందర్భంలో స్త్రీలలో ఇన్సులిన్ నిరోధకత వల్ల హార్మోనల్ తేడా లు ఎలా వస్తాయో చెప్పుకోవడం ముఖ్యం. స్త్రీ హార్మోన్లన్నీ వినాళికా గ్రంధి వ్యవస్థ (endocrine system) తో ముడిపడివుంది.  కాబట్టి వీటిలో ఒకటి పనిచెయ్యకపోయినా మరొకటి బ్యాలన్స్ తప్పడం అనేది పరిపాటి. అలాంటిదే డయాబిటిస్ మరియు స్త్రీ లలో మెనోపాజ్. ఇన్సులిన్ ఈస్ట్రోజెన్, టెస్టోస్టీరాన్, డీహైడ్రోఎపీయాండ్రోస్టీరోన్ మరియు థైరాయిడ్ హార్మోన్లతో సంకర్షిస్తుంది. ఇన్సులిన్ గనుక బ్యాలన్స్ తప్పితే స్త్రీ హార్మోన్లు సరిగ్గా పనిచెయ్యవు, మెనోపాజ్ త్వరితంగా సంభవిస్తుంది. దానిని పెరీమెనోపాజ్ (perimenopause) అంటారు. పూర్ క్వాలిటీ ఇన్సులిన్ వల్ల టైప్ 2 డయబిటిసే కాదు, సెక్స్ హార్మోనులు బ్యాలన్స్ తప్పుతాయి మరియు మిగితా జీవక్రియలన్నీ దెబ్బతింటాయి. అందువల్ల స్త్రీలు తప్పని సరిగా అప్పుడప్పుడు ఇన్సులిన్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అదే ముఖ్యం గా బ్యాలెన్సెడ్ డైట్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, హై క్వాలిటీ ప్రోటీన్లు, క్రొవ్వు పదార్ధాలు తీసుకుంటూవుండాలి. ఇది ఇన్సులిన్ తయారీకి ముఖ్యం. 

పెరీమెనోపాజ్ తో బాధపడుచున్న ఆడువారిలో ఇన్సులిన్ నిరోధకత కనిపిస్తున్నదట. పెరీమెనోపాజ్ తో బాధపడుచున్నవారిలో హాట్ ఫ్లాషెస్ (ఆకస్మికంగా వంట్లో వేడిని ఫీల్ అవ్వడం) చాలా పరిపాటి. పెరీ మెనోపాజ్ లక్షణాలని ట్రీట్ చెయ్యడానికి ముందు ఇన్సులిన్ ని బ్యాలన్స్ లో పెట్టాలి. ఇన్సులిన్ నిరోధకతను హీల్ చెయ్యకుండా పెరీ మెనోపాజ్ ని ట్రీట్ చెయ్యడం అసాధ్యం. ఇన్సులిన్ నిరోధకత డయాబిటిస్ కు, మెనోపాజ్ ప్రాబ్లంస్ కే కాకుండా గుండె జబ్బులు, బ్రెస్ట్ క్యాన్సర్, ఆల్జీమర్స్ లాంటి బ్రెయిన్ వ్యాధులు, పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోము కు కూడా కారణ భూతమవుతుంది. కొంతవరకు ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్ కి కూడా ఇన్సులిన్ నిరోధకత దారితీస్తున్నదని దాఖలాలు కనిపిస్తున్నాయి.

ఇన్సులిన్ నిరోధకత క్రొవ్వు మెటబాలిజాన్ని కూడా దెబ్బ తీస్తుంది. కణాలు గనుక రక్తం లోని ఎక్కువైన గ్లూకోజ్ ని వినియోగించుకోని పక్షంలో లివర్ ఆ గ్లూకోజ్ ని క్రొవ్వుగా మారుస్తుంది. క్రొవ్వులో గ్లూకోజ్ నిలవవుంటుంది. అందువల్ల క్రొవ్వుకణాల నిండా గ్లూకోజ్ రిసెప్టర్లు ఉంటాయి. అందువల్ల ఇన్సులిన్ నిరోధకత తో బాధపడుచున్న స్త్రీ క్రొవ్వు వలన బరువు పెరగడమే కాక గ్లూకోజ్ దొరకక కణాలన్నీ శుష్కించడం వల్ల అలసటకు, శక్తివిహీనతకు గురి అయ్యి ఎక్కువగా పిండిపదార్ధాల ఆహారాన్ని తీసుకునే టెండన్సీ పెరుగుతుంది. అంటే ఇక్కడ సహజ సిద్దంగా ఎలాగూ fat metabolism జరుగుతుంది, కానీ ఈ ఎక్స్ ట్రా గ్లూకోజ్, క్రొవ్వు గా మారడంవల్ల ఎక్స్ ట్రా క్రొవ్వు శరీరం లో పేరుకుపోతుంది. క్రొవ్వు కణాలు ఈస్త్రోజెన్ ఉత్పత్తి కారకాలుకూడ. అందువల్ల.. ఈ స్త్రీలలో ఈస్ట్రోగజెన్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యి, పెరీమెనోపాజ్ ఎర్లీ స్టేజ్ లో చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.   సహజ సిద్దం గా మెనోపాజ్ దగ్గిరపడినవాళ్ళల్లోకూడా ఎడ్రినల్ మరియు థైరాయిడ్ హార్మోన్స్ లో తేడాలు వచ్చి ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది.

ఇన్సులిన్ నిరోధకతను ఎలా నివారించవచ్చు?

ఇన్సులిన్ నిరోధకత ఒబీసిటీ వాళ్ళలోనే కాదు, సన్నగా ఉన్నవాళ్ళలో కూడా వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం లో ఎక్కువ శాతం రిఫైన్ డు కార్బోహైడ్రేట్లు అంటే వైట్ బ్రెడ్, షుగర్, పాస్టా, పొటాటో, కోక్/పెప్సీ, ప్రోసెస్ డ్ ఫుడ్ మొదలైనవి. ఎంత ఎక్కువ రిఫైన్ డు లేదా ప్రాసెస్ డు ఫుడ్ తీసుకుంటే అంత ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాల్సివుంటుంది, ఆ ఫుడ్డుని మెటాబొలైజ్ చెయ్యడానికి. రాను రాను రక్తములో ఎక్కువ ఇన్సులిన్ వుండిపోయిందంటే..అంత తక్కువగా కణాలు గ్లూకోజ్ ని శోషించుకుంటున్నాయన్న మాట. వయసుపోతున్నకొలదీ కూడా ఆ ప్రోసెస్ డ్ ఫుడ్ మెటాబొలైజ్ అవ్వడం పూర్తిగా కుంటు పడి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పూర్తిగా దెబ్బతింటుంది.

అధిక కొలెస్టెరాల్, అధిక ట్రై గ్లిజెరైడ్స్, రక్తపోటు ఉన్నవాళ్ళల్లో ఇన్సులిన్ నిరోధకతకు అవకాశం వుంది, దీనికి వయస్సు, బరువు తో సంబంధం లేదు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వున్న వాళ్ళల్లో కూడా ఇన్సులిన్ నిరోధకత అవకాశం వుంటుంది, బ్లడ్ ప్రెషర్ వేసుకునే మందులు ఇన్సులిన్ నిరోధకతను నివారించవు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

మంచి డైట్. చికెన్, గ్రుడ్లు, పాలు, ఎక్కువ ఫైబర్ వున్న ధాన్యాలు, వెజిటబుల్స్, లెగ్యూము, ఆకుకూరలు, పళ్ళు.
రోజూ కనీసం 30 నిముషాల పాటు ఎక్సర్సైజ్.
మానసిక వత్తిడులకు దూరం గా వుండడం
పొగ త్రాగకూడదు, ఆల్కహాల్ మోతాదును చాలా తగ్గించాలి.

మంచి నిద్ర.   

No comments:

Post a Comment